మాజీ హీరోయిన్ సీత పెద్ద కూతురు వివాహం వచ్చే నెల మార్చి 8న జరుగనుంది అయితే ఆ వివాహానికి సీత హాజరు అవుతుందా ? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది ఇదే విషయాన్నీ సీత మాజీ భర్త పార్తీపన్ ని అడుగగా తప్పకుండా వస్తుంది , ఆమెకు నా మీద కోపం కావచ్చు కానీ ఓ తల్లిగా తప్పకుండా వస్తుంది అంతేకాదు వివాహ నిశ్చితార్దానికి వచ్చింది కదా ! అంటూ సెలవిచ్చాడు అంతేకాదు మార్చి 8 న మహిళా దినోత్సవం కాబట్టి తప్పకుండా వస్తుంది అని అంటున్నాడు పార్తీపన్ .
సీత పెద్ద కూతురు వివాహానికి రావడం ? రాకపోవడం ? ఏంటి అని అనుకుంటున్నారా ? ఒకప్పుడు సీత – పార్తీపన్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ ప్రేమకు గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు కూడా . అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు . ఇద్దరు కూతుర్లు కావడంతో పెద్ద కూతురు కార్తీక తండ్రి పార్తీపన్ దగ్గర పెరుగుతుండగా చిన్న కూతురు అభినయ సీత దగ్గర పెరుగుతోంది . అయితే కీర్తన వివాహ నిశ్చితార్థం జరుగగా సీత ఆ వేడుకలో పాల్గొంది , ఇక మార్చిలో జరిగే పెళ్ళిలో కూడా పాల్గొంటుంది అని సమాచారం .