Homeటాప్ స్టోరీస్శ్రీ రెడ్డి కి తమిళనాట ఛాన్స్ లు

శ్రీ రెడ్డి కి తమిళనాట ఛాన్స్ లు

actress producer kutti padmini supports sri reddyవివాదాస్పద నటి శ్రీ రెడ్డి కి తమిళనాట ఛాన్స్ లు వచ్చేలా ఉన్నాయి . కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన ఈ భామ తాజాగా కోలీవుడ్ మీద పడింది . అక్కడి దర్శకులను ఒకరిద్దరు హీరోలను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేసింది దాంతో అక్కడ కూడా అట్టుడికిపోయింది అయితే తెరవెనుక విశాల్ నడిపిన మంత్రాంగంతో శ్రీ రెడ్డి లీక్స్ వాయిదా పడ్డాయి . ఇక ఈ భామ చేసిన ఆరోపణల సంగతి పక్కన పెడితే మాజీ నటి , నిర్మాత కుట్టి పద్మిని శ్రీ రెడ్డి కి తమిళనాట ఛాన్స్ లు ఇవ్వడానికి ముందుకు వచ్చింది అంతేకాదు ఈ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఇప్పుడు కాదు 1983 నుండే ఉన్నాయని సెలవిచ్చింది కూడా .

తమిళంలో కుట్టి పద్మిని పలు సూపర్ హిట్ సీరియల్స్ తీసింది దాంతో శ్రీ రెడ్డి కి మంచి ఛాన్స్ వచ్చింది అని అంటున్నారు అయితే శ్రీ రెడ్డి ఆ ఛాన్స్ లను ఉపయోగించుకుంటుందా ? లేక మళ్ళీ యధావిధిగా ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తుందా చూడాలి . కుట్టి పద్మిని ఇచ్చే ఛాన్స్ వినియోగించుకుంటే నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్లు అవుతుంది లేదంటే షరా మామూలే !

- Advertisement -

English Title: actress producer kutti padmini supports sri reddy

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All