నీ లాంటి వాళ్ళు అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటించాలి కానీ చిన్న చిన్న సినిమాల్లో కాదు అని చెప్పడమే కాకుండా నన్ను వచ్చి కలవు తప్పకుండా స్టార్ హీరోల చిత్రాలు ఇప్పిస్తా అని హీరోయిన్ ” పూనమ్ కౌర్ ” ఇంటికి వచ్చి మరీ చెప్పాడట ఓ అగ్ర నిర్మాత . అతడి మాటలు నమ్మి తల్లితో కలిసి అతడి దగ్గరకు వెళితే అమ్మని కూడా వెంటేసుకు వచ్చింది కదా ! దాంతో కుదరదని సరిగ్గా మాట్లాడకుండా పంపించాడట ఆ అగ్ర నిర్మాత . ఇక నా బెడ్ రూం లోకి నువ్ ఒంటరిగా వస్తే నీకు ఛాన్స్ లే ఛాన్స్ లు అంటూ ఆఫర్ లు ఇచ్చాడట కానీ నేను అలాంటిదాన్ని కాదు అందుకే నాకు సినిమాలు లేకుండా పోయాయాని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది పూనమ్ కౌర్ .
ఇంతకుముందు దర్శకులు త్రివిక్రమ్ పై సంచలన ఆరోపణలు చేసిన ఈ భామ తాజాగా పాత విషయాలను వెల్లడిస్తోంది . ఇక ఆ అగ్ర నిర్మాత ఎవరు ? అన్నది మాత్రం చెప్పడం లేదు కానీ అవకాశాల కోసం ఆత్మ ని చంపుకొని పక్కలో పడుకోవాల్సిన అవసరం మాత్రం లేదని అంటోంది పూనమ్ కౌర్ . తెలుగులో పలు చిత్రాల్లో నటించింది ఈ భామ అయితే అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది అలాగే అగ్ర హీరోల సరసన ఛాన్స్ లు రాలేదు అగ్ర దర్శకుల తో పనిచేసే అదృష్టం కూడా దక్కలేదు కానీ త్రివిక్రమ్ మాత్రం ఛాన్స్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా అన్యాయం చేసాడని ఆరోపించింది . ఆంధ్రప్రదేశ్ కు చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈ భామ పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై కూడా ఆరోపణలు చేస్తోంది .
English Title: actress poonam kaur sensational comments on star producer