
కరోనా సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా మరణ మృదంగాం మోగిస్తోంది. రోజు రోజుకీ కరోనా బారిన పడిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. మరణాలు కూడా అంతకంతకు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయి. పట్టణాల్లో, పల్లెల్లో కరోనా విలయాన్ని సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా కరోనా ధాటికి మరణిస్తున్నవారే అత్యధికంగా కనిపిస్తున్నారు.
ఇదిలా వుంటే కరోనా పంజా సినీ వర్గాలని కూడా కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటి వరకు ఇండస్ట్రీకి చెందిన చాలా మంది దీని బారిన పడిన విషయం తెలిసిందే. కొంత మంది మరణించగా మరి కొంత మంది దీని బారిన పడి కోలుకున్నారు. కొంత మంది కోలుకుంటున్నారు కూడా. తాజాగా టాలీవుడ్‌కు చెందిన రచయిత నంద్యాల రవి కోవిడ్ బారిన పడ్డారు.
గత కొన్ని రోజులుగా ఆయన కోవిడ్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన సీరియస్ కండీషన్ నుంచి తాజాగా బయటపడ్డారు. ఇందు కోసం ఆయన హాస్పిటల్ ఖర్చు 6 నుంచి 7 లక్షల వరకు అయినట్టు చెబుతున్నారు. ఈ విషయం తెలిసి నటుడు సప్తగిరి స్పందించారు. సాటి వ్యక్తికి ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు. లక్ష రూపాయలు నంద్యాల రవికి ఆర్థిక సాయం అందించి సప్తగిరి గొప్ప మనసు చాటుకోవడం విశేషం.
#Saptagiri‘s Rs.1 Lakh Financial Help To #NandyalaRavi
Director Nandyala Ravi’s condition was serious until now, due to Coronavirus, He has been receiving treatment at a hospital, Actor Saptagiri has come forward and donated Rs. 1 Lakh from his side@IAmSaptagiri pic.twitter.com/qsTNXFDJiC
— Shreyas Group (@shreyasgroup) May 6, 2021