
‘అందాల రాక్షసి’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన నటుడు ‘రాహుల్ రవీంద్రన్’. అలా కొన్ని కొన్ని సినిమాలు చేసుకుంటూ వెళ్లి గత సంవత్సరం ఒక్కసారిగా మెగా ఫోన్ పట్టుకొని ‘చిలసౌ’ సినిమాకి దర్శకుడిగా అయిపోయాడు. సినిమా ట్రైలర్ దగ్గరనుండి థియేటర్లో హిట్ బొమ్మ పడి సక్సెస్ అయ్యేదాకా అసలు రాహుల్ రవీంద్రలో ఇంత టాలెంట్ ఉంది అని ఎవ్వరు అనుకోలేకపోయారు.
చిలసౌ సినిమా హిట్ అవ్వడమే కాదు…66 వ జాతీయ చిత్ర పురస్కారాలు మరియు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ వారు…..చిలసౌ సినిమాకి ‘ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే జాతీయ చలనచిత్ర పురస్కారం’ మరియు ‘ ఉత్తమ తొలి నటి, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ తొలి దర్శకుడు’ గా సినిమాలో ముగ్గురికి అవార్డులు దక్కాయి. సరిగ్గా మొదటి సినిమాకి అవార్డు అందుకున్న రాహుల్ రవీంద్రన్ కి తన రెండవ సినిమా అయిన ‘మన్మధుడు-2’ రిలీజ్ అయ్యి ఘోర పరాజయం అవ్వడం జరిగింది.
మొదటి సినిమా ద్వారా చాలా మంచి పేరు సంపాదించుకున్న రాహుల్ కి ఈ మన్మధుడు -2 సినిమా మరిచిపోలేని జ్ఞాపకం అయ్యింది. అయితే హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా చాలామంది దర్శకులు కోలుకొని తర్వాతి సినిమాల మీద గత సినిమాల ప్రభావం పడకుండా చూసుకుంటారు. మరి రాహుల్ తన తర్వాతి సినిమా మీద ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు.