Homeటాప్ స్టోరీస్ప‌వ‌న్ సినిమా సెట్‌లో గాయ‌ప‌డిన విల‌న్!

ప‌వ‌న్ సినిమా సెట్‌లో గాయ‌ప‌డిన విల‌న్!

Actor Aditya menon injured at Hari hara veeramallu shoot
Actor Aditya menon injured at Hari hara veeramallu shoot

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ `హ‌రి హ‌ర వీర‌మల్లు`. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి తెర‌కెక్కిస్తున్నారు. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని మెగా
సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై భారీ చిత్రాల నిర్మాత ఏ.ఎం. ర‌త్నం స‌మ‌ర్ప‌ణ‌లో ఏ.ద‌యాక‌ర్‌రావు ఈ భారీ పిరియాడిక్ మూవీని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది.

17వ శ‌తాబ్దంలోని కోహినూర్ వ‌జ్రం నేప‌థ్యంలో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్న‌ట్టు చిత్ర వ‌ర్గాలు ఇటీవ‌ల అధికారికంగా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్ ఫైట్ మాస్ట‌ర్ శ్యామ్ కౌశ‌ల్ నేతృత్వంలో గ‌త కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన పోరాట ఘ‌ట్టాల్ని చిత్రీక‌రిస్తున్నారు. ప‌వ‌ర్‌స్టార్ పై ఇటీవ‌లే ఓ హైవోల్టేజ్ యాక్ష‌న‌ప్ సీక్వెన్స్‌ని విజ‌య‌వంతంగా పూర్తి చేశార‌ట‌. ఇదిలా వుంటే ఇందులో న‌టిస్తున్న న‌టుడు ఆదిత్య మీన‌న్ ప్ర‌మాదానికి గురైన‌ట్టు తెలిసింది.

- Advertisement -

గుర్ర‌పు స్వారీకి సంబంధించిన స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తుండ‌గా న‌టుడు ఆదిత్య మీన‌న్ ప్ర‌మాదానికి గుర‌య్యార‌ని, ఆయ‌న‌కు తీవ్ర గాయాల‌య్యాయ‌ని తెలిసింది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే తేరుకున్న యూనిట్ సిబ్బంది వెంట‌నే ఆయ‌న‌ను సిటీలోని య‌శోదా హాస్పిట‌ల్‌కు త‌ర‌లించార‌ట‌. అయితే మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని ఓ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ కు ఆయ‌న‌ని త‌ర‌లించిన‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All