
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఈ శుక్రవారం మధ్యాహ్నం 1:04 గంలకు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆగస్టు 5న తనకు కరోనా లక్షణాలు బయట పడ్డాయని, ఇందులో భయపడాల్సిన పనేమీ లేదని, తన అభిమానులు ఆందోళన చెంద వద్దని బాలు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని కూడా పోస్ట్ చేశారు. ఆ తరువాత ఆయన చికిత్స కోసం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు.
గత 40 రోజులుగా కరోనా మహమ్మారితో పోరాడిన ఆయన చివరికి శుక్రవారం తుది శ్వాస విడిచారు. అయితే సంగీ ప్రపంచాన్ని ఏలిన మధురగాయకుడని, 45 వేలకు పై చిలుకు పాటలని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాష్లలో పాడారని, తనదైన మధురమైన గాత్రంతో అసంఖ్యాకమైన ప్రేక్షకుల్ని సొంతం చేసుకున్నారని ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిందే అంటున్నారు హీరో యాక్షన్ కింగ్ అర్జున్.
ఓ లెజెండరీ సింగర్ ఆయన. ది గ్రేట్ హ్యుమన్ బీయింగ్. వేల పాటలు పాడిన గాయకుడిగా అరుదైన ఘనతని సాధించారు. అన్ని చిత్ర పరిశ్రమలు ఆయనకు భారతరత్న వచ్చే విధంగా కృషి చేయాలన్నారు అర్జున్. శనివారం జరిగిన బాలు అంత్యక్రియల్లో అభిమానులు, సెలబ్రిటీలు పాల్గొన్న విషయం తెలిసిందే. అందులో అర్జున్ కూడా పాల్గొని తాజా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగామారింది.