
మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి సంయుక్తంగా నటించిన ఆచార్య సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్లాప్ టాక్ మూటకట్టుకుంది. మొదటి రోజు మొదటి షో తోనే ప్లాప్ టాక్ రావడం తో ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్ల ఫై పడింది. మొదటి రోజు ఎదోలాగా పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ రెండో రోజు నుండి దారుణంగా పడిపోయాయి. ఈరోజు నుండి చాల థియేటర్స్ లలో ఆచార్య ను తీసేసి ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ చిత్రాలను రన్ చేయడం మొదలుపెట్టారు.
ఇక ఓవర్సీస్ లో కలెక్షన్స్ చూస్తే..యూఎస్ఏలో ప్రీమియర్స్ మరియు ఫస్ట్ డే కలిపి $817K కలెక్షన్స్ రాబట్టగా.. శనివారం కేవలం 87k డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రెండో రోజు కలెక్ట్ చేసిన 87783 డాలర్లు కలిపి మొత్తం $905132 కలెక్షన్స్ రాబట్టింది. శనివారం రోజు ‘ఆచార్య’ సినిమా కేవలం 87k డాలర్లు మాత్రమే వసూలు చేస్తే.. అదే రోజు ‘KGF 2’ సినిమా 100k కంటే ఎక్కువ వసూలు చేసింది. దీనిని బట్టి అర్ధం చేసుకోవాలి..కంటెంట్ ఉంటె అది చిన్న హీరో సినేమైనా జనాలు చూసేందుకు పరుగులు పెడతారు..కంటెంట్ లేకపోతే మెగా హీరోలు నటించిన ఆ పక్కకు కూడా చూడరు.