Homeటాప్ స్టోరీస్అభిమానులకు షాక్ కు గురిచేస్తున్న ఆచార్య టాక్ ..

అభిమానులకు షాక్ కు గురిచేస్తున్న ఆచార్య టాక్ ..

Acharya talk
Acharya talk

మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి సంయుక్తంగా నటించిన ఆచార్య సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పట్నించో ఊరిస్తున్న ఈ సినిమా విడుదల ఆలస్యమయ్యే కొద్దీ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్లాప్ అంటే తెలియని డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేయడం..ఫస్ట్ టైం ఫుల్లెన్త్ లో రామ్ చరణ్ , చిరంజీవి కలిసి నటించడం, సక్సెస్ ఫుల్ హీరోయిన్ పూజా హగ్దే హీరోయిన్ గా నటించడం , రెజీనా ఐటెం సాంగ్ చేయడం, ఓ మెసేజ్ ప్రేక్షకులకు ఇవ్వడం, మణిశర్మ మ్యూజిక్ ఇవ్వడం ఇవన్నీ కూడా సినిమా ఫై అంచనాలు పెరిగేలా చేసాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా..? ప్రేక్షకులు , అభిమానులు ఏమంటున్నారు..? చిరు – చరణ్ లు యాక్టింగ్ ఎలా ఉంది…? మెగా అభిమానులకు ఎలాంటి ట్రీట్ ఇచ్చాడు..? కొరటాల ఎలాంటి సక్సెస్ అందుకున్నాడు..? అనేవి టాక్ లో చూద్దాం.

ఫస్టాఫ్ ఓకే అని, సెకండాఫ్‌లో రామ్ చరణ్, చిరంజీవి సీన్స్ పూనకాలు తెప్పించాయని అంటున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ రోల్ ఈ సినిమాకు ప్రాణం పోసిందని అంటున్నారు. ఇంటర్వెల్ సీన్‌లో సిద్ద ఇరగదీశాడని చెబుతున్నారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉందని , రెజీనా ఐటెం సాంగ్ లో అందాల ఆరబోత చేసిందని చెపుతున్నారు. సెకండాఫ్‌లో చిరంజీవి, రామ్ చరణ్ స్క్రీన్ ప్రజెన్స్ హైలైట్ అని, ఫైట్స్, సాంగ్స్ సూపర్ అంటున్నారు. క్లైమాక్స్‌లో చిరంజీవి విశ్వరూపం చూపించాడని అంటున్నారు.

- Advertisement -

మరికొంతమంది కొరటాల శివ నుంచి ఈ తరహా స్క్రిప్ట్ ఊహించలేదని, స్టోరీ చాలా వీక్‌గా ఉందనే కోణంలో నెటిజన్ల ట్వీట్స్ కనిపిస్తున్నాయి. కొరటాల గత చిత్రాలతో ఏమాత్రం పోల్చే విధంగా ఈ సినిమా లేదనే టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఫస్టాఫ్ అంతా సాగదీతగా ఉందని, క్లైమాక్స్‌ ఎమోషనల్‌ సీన్స్ కాస్త పర్వాలేదని అంటున్నారు. ఓవరాల్ గా మాత్రం సినిమాకు నెగిటివ్ టాక్ ఎక్కువగా వినిపించడం అభిమానులు షాక్ కు గురి అవుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All