
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచానాలు నెలకొని ఉన్నాయి. ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాబోతుంది. ఈ తరుణంలో ఈ నెల 23 న యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్ లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పటు చేయబోతున్నారు. దీనికి సంబదించిన అధికారిక ప్రకటనను తెలియజేసారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దర్శక ధీరుడు రాజమౌళి ఈ భారీ ఈవెంట్ కి ఛీఫ్ గెస్ట్ లుగా హాజరు కానున్నారని వినికిడి.
మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఈ భారీ మూవీని శ్రీమతి సురేఖ సమర్పణలో నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ నిర్మించారు. అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవి ఎండోమెంట్ అధికారికగా ఓ దశలో చరణ్ తో కలిసి నక్సలైట్ గా నూ కనిపించబోతున్నారు. ధర్మస్థలి కోసం వీరు ఏం చేశారు? .. చరణ్ కిచ్చినన మాట కోసం ఆచార్యుడు ఏం చేశాడు? ధర్మస్థలికి అండగా ఎలా నిలిచాడనే కథా కథనాలతో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తుంది .