నైజాం ఏరియా లో మెగా హీరోలకు ప్రేక్షకులకు బ్రహ్మ రథంపడుతుంటారు. ముఖ్యంగా చిరంజీవి , పవన్ కళ్యాణ్ చిత్రాల కలెక్షన్స్ రికార్డ్స్ సృష్టిస్తాయి. కలెక్షన్ల విషయంలోనే కాదు ..అడ్వాన్స్ బుకింగ్ లోను పలు రికార్డ్స్ బ్రేక్ చేస్తుంటారు. తాజాగా ఆచార్య విషయంలోనూ అలాగే జరిగింది. తెలంగాణలో మొత్తంగా 649 షోలు ప్రదర్శించనున్నారు. టికెట్ రేట్లు పెంచడం ఈ సినిమా అనుకూలంగా మారింది. మల్టీప్లెక్స్‌లో 500, 410, 354 రూపాయలు ఉండగా. సింగిల్ థియేటర్‌లో 210, 150, 90 రూపాయలుగా టికెట్ రేట్‌ను నిర్ణయించారు. తొలి రోజున అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 5.9 కోట్లు రాబట్టింది. ఒక్క హైదరాబాద్ లో ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఈ చిత్రం 4.27 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డు సృష్టించింది.
ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి సంయుక్తంగా నటించిన ఆచార్య సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పట్నించో ఊరిస్తున్న వస్తున్న సినిమా కావడం తో అంతటా ఆసక్తి పెరిగింది. సినిమా ఎలా ఉంది..చిరంజీవి – చరణ్ ల సీన్లు ఎలా ఉన్నాయి..అనేవి తెలుసుకోవాలని అభిమానులు , ప్రేక్షకులు సోషల్ మీడియా లో సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు మిశ్రమ టాక్ వస్తుంది. పూర్తి రివ్యూస్ వస్తే కానీ సినిమా పరిస్థితి ఏంటి అనేది తెలుస్తుంది.