Homeగాసిప్స్ఈ ఏడాది ఆచార్య డౌటే అంటున్నారే!

ఈ ఏడాది ఆచార్య డౌటే అంటున్నారే!

ఈ ఏడాది ఆచార్య డౌటే అంటున్నారే!
ఈ ఏడాది ఆచార్య డౌటే అంటున్నారే!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య ఏ నిమిషాన మొదలుపెట్టారో కానీ దానికి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఈ సినిమాను మొదలుపెట్టడానికి దర్శకుడు కొరటాల శివ దాదాపు 2 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. చిరంజీవి ముందు సినిమా షూటింగ్ తో బిజీగా ఉండడంతో కొరటాల శివకు ఎదురుచూపులు తప్పలేదు. వరస హిట్స్ మీద ఉన్న దర్శకుడు ఇలా రెండేళ్లు సినిమా లేకుండా ఆగిపోవడం అనేది చాలా కష్టమైన విషయం.

ఏదైతేనేం ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు ఈ ఏడాది ప్రారంభమైంది. ఇక మొదవలవ్వడమే ఆలస్యం చకచకా షూటింగ్ కానిచేద్దామని దర్శకుడు ఫిక్స్ అయ్యాడు. మొదట మూడు సాంగ్స్ ను, తర్వాత ఒక భారీ ఫైట్ ను చిత్రీకరించాక చివరికి టాకీ పార్ట్ మొదలైంది. రెజీనాతో స్పెషల్ సాంగ్, చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్, ఒక మాంటేజ్ సాంగ్ ను షూట్ చేసారని సమాచారం.

- Advertisement -

90ల బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. ఇందులో చిరంజీవి యూనియన్ లీడర్ గా కనిపించబోతున్న సంగతి ఇటీవలే లీకైన ఫోటోలను బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో చిక్కు స్పెషల్ రోల్ వల్ల వచ్చింది. దాదాపు 30 నిమిషాల నిడివున్న పాత్రకు మొదట రామ్ చరణ్ ను అనుకున్నారు, తర్వాత మహేష్ వద్దకు వెళ్లారు కానీ చివరికి చరణ్ దగ్గరే ఆగారు. చరణ్ ఈ పార్ట్ కు షూటింగ్ చేయాలంటే జూన్ తర్వాతే అవుతుంది. సో దాని ప్రకారం షెడ్యూల్స్ వేసుకున్నారు.

అయితే ఇప్పుడు కరోనా వైరస్ ఈ చిత్రానికి పెద్ద దెబ్బే కొట్టింది. ఆచార్య షూటింగ్ లేట్ అవ్వడమే కాదు ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ ఆలస్యమవుతుంది. మే కు ఆర్ ఆర్ ఆర్ షూట్ మొత్తం పూర్తైపోతుందని ముందు అంచనా వేశారు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో ఆర్ ఆర్ ఆర్ షూట్ ఎప్పటికి పూర్తవుతుందో తెలీదు.

ఆచార్య షెడ్యూల్స్ ఎప్పటికి పూర్తవుతాయో తెలీదు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ ఏడాది ఆచార్య ఉండే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All