Homeటాప్ స్టోరీస్ఆచార్య షూటింగ్ పై మేజర్ అప్డేట్

ఆచార్య షూటింగ్ పై మేజర్ అప్డేట్

ఆచార్య షూటింగ్ పై మేజర్ అప్డేట్
ఆచార్య షూటింగ్ పై మేజర్ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ ఏడాదిన్నరగా సాగుతోంది. కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కు పలుమార్లు అంతరాయం కలిగిన విషయం తెల్సిందే. ఏప్రిల్ లో ఈ చిత్ర షూటింగ్ ను నిలిపివేశారు. ప్రస్తుతం చిరంజీవి వ్యాక్సిన్ కూడా వేయించుకున్నాడు.

తాజా సమాచారం ఆచార్య ఫైనల్ షెడ్యూల్ కు సర్వం సిద్ధమైంది. జులై 7 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఒక పాట, మేజర్ ఫైట్ సీక్వెన్స్, పలు ప్యాచ్ వర్క్ సన్నివేశాలను షూట్ చేస్తారు. ఈ నెలలోనే ఆచార్య షూటింగ్ ను పూర్తి చేసేలా కొరటాల శివ ప్లాన్ చేసాడు.

- Advertisement -

ఇక ఆచార్య రిలీజ్ డేట్ పై ప్రస్తుతానికి అప్డేట్ లేకపోయినా దసరాకు విడుదల చేసేలా టీమ్ ప్రయత్నిస్తోంది. అప్పటికి కచ్చితంగా పరిస్థితులు అదుపులోకి వస్తాయని నమ్ముతున్నారు. ఒకవేళ దసరా మిస్ అయితే 2022 సంక్రాంతికే ఆచార్య వచ్చేది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All