
మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ లు నటిస్తున్న ఆచార్య మూవీ ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రొమోషన్ల ఫై దృష్టి సారించారు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమా ఫై అంచనాలు పెరుగగా..ఈరోజు సాయంత్రం సినిమాలోని భలే భలే బంజారా ఫుల్ సాంగ్ రిలీజ్ కాబోతుంది. ఈ సాంగ్ లో చిరంజీవి , రామ్ చరణ్ లు కలిసి స్టెప్స్ వేయడం విశేషం. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. శంకర్ మహాదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. చిరంజీవి, రామ్ చరణ్‌లు ఇద్దరూ ఈ పాటలో కలిసి డాన్స్ ఇరగదీశారని..ప్రోమో చూస్తే అర్దమవుతుంది. ఈ ప్రోమో చూసిన అభిమానులు సాంగ్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో కాజల్ , పూజా హగ్దే లు హీరోయిన్ లుగా నటించారు.
ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట. ఆ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ జోడిగా నటించగా.. రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే నటించారు.
We're all in for a #MegaGraceTreat today ??
The carnival song #BhaleBhaleBanjara out today at 4:05 PM
▶️ https://t.co/qwBMswMfm7#AcharyaOnApr29
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala #Manisharma @NavinNooli @MatineeEnt @KonidelaPro @adityamusic @vamsikaka pic.twitter.com/SSnyJuSFfc
— BA Raju's Team (@baraju_SuperHit) April 18, 2022