Homeటాప్ స్టోరీస్ఓవర్సీస్ లో మొదలైన ఆచార్య హడావిడి

ఓవర్సీస్ లో మొదలైన ఆచార్య హడావిడి

Acharya advacne booking starts in us
Acharya advacne booking starts in us

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచానాలు నెలకొని ఉన్నాయి. ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాబోతుంది. ఇక అమెరికాలో ఆచార్య సినిమా హడావిడి అప్పుడే మొదలైంది.

ఈ సినిమా అడ్వాన్సు బుకింగ్‌ను డల్లాస్‌లో సోమవారం ప్రారంభించారు. తొలుత 10 లొకేషన్లలో 29 షోల కోసం టికెట్ల అమ్మకాలు ప్రారంభించారు. సినిమా టికెట్ ధరను 21 డాలర్లుగా నిర్ణయించారు. తొలి రోజు సుమారు 500 టికెట్లు అమ్ముడు కాగా, మొత్తం 8740 డాలర్లు కలెక్షన్లు నమోదైనట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు అభిమానుల నుంచి మంచి రెస్సాన్స్ వస్తుండడం తో రాబోయే రోజుల్లో టికెట్స్ హాట్ కేకుల్లా సేల్ కావడం ఖాయం అంటున్నారు.

- Advertisement -

ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను హాజరు కాబోతున్నట్లు సమాచారం. ముందుగా ఈ వేడుకను విజయవాడ లో జరపాలని , ముఖ్య అతిధిగా సీఎం జగన్ ను ఆహ్వానించబోతారనే వార్తలు వినిపించాయి. కానీ సడెన్ గా వేదిక ను హైదరాబాద్ కు షిఫ్ట్ చేయడానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీ లో సిద్ద అనే పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All