Homeటాప్ స్టోరీస్ధర్మస్థలి విశేషాలను మేకింగ్ రూపంలో పంచుకున్న చిరంజీవి

ధర్మస్థలి విశేషాలను మేకింగ్ రూపంలో పంచుకున్న చిరంజీవి

Acharya About Dharmasthali
Acharya About Dharmasthali

మెగాస్టార్ చిరంజీవి..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆచార్య మూవీ రేపు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా సాంగ్స్ , ట్రైలర్స్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అని యావత్ మెగా అభిమానులు , సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఆచార్య సినిమాలో వేసిన ధర్మస్థలి సెట్ గురించి చిరంజీవి వివరించారు. చిరంజీవి ఆచార్య కోసం వేసిన సెట్ ని వివరించిన వీడియోని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఆచార్య సినిమా కోసం ధర్మస్థలి అనే ఊరినే సెట్ వేసి నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో చిరంజీవి ఆచార్య ధర్మస్థలి సెట్ లో ఉండి దాని గురించి మాట్లాడుతూ.. ”కోకాపేటలో ఒక టెంపుల్ టౌన్ నిర్మించాం ఆచార్య కోసం. కొరటాల నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఒక టెంపుల్ టౌన్ కావాలి, పాతకాలం నాటిది. ఒక పక్క కొండలు, మరో పక్క గ్రీనరీ, మరో పక్క పెద్ద నది, ఊరిలా ఉంటుంది అని చెప్పారు. చాలా బాగుంది కానీ ఇన్ని కాంబినేషన్స్ తో లొకేషన్ ఎక్కడ దొరుకుతుంది అని నాకు మొదటి నుంచి డౌట్ ఉంది. కొన్ని నెలలకి కోకాపేట లోనే టెంపుల్ టౌన్ నిర్మించాం.

- Advertisement -

”20 ఎకరాల్లో ఒక టౌన్ ని అగ్రహారాలు, మండపాలు, గుడి, గాలి గోపురాలు, ఒక పెద్ద విగ్రహం, కొండలు, ఇవన్నీ ఉండేలాగా నిర్మించారు. టోటల్ గా సినిమా చూసేసరికి చాలా థ్రిల్ గా ఫీల్ అయ్యాం. ఇలాంటి లొకేషన్స్ లో రియల్ గా దొరకవు, ఒకవేళ దొరికినా షూటింగ్ ఇంకా అవుతూనే ఉండేది. ఈ సెట్ ఇంత బాగా రావడానికి ఆర్ట్ డైరెక్టర్ సురేష్ ముఖ్య కారణం. అతను తమిళనాడు చిదంబరం నుంచి వచ్చాడు. చిదంబరం అంటే అక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి. అతను చిన్నప్పటినుంచి ఆ టెంపుల్స్ చూశాడు కాబట్టి స్థంబాలు, విగ్రహాలు, మండపాలు ఎలా ఉంటాయి, గుళ్ళు, గాలి గోపురాలు ఎలా ఉంటాయి అని అతనికి బాగా తెలుసు. అందుకే అంత బాగా డిజైన్ చేశాడు. దేశం మొత్తం మీద సినిమా కోసం వేసిన సెట్స్ లో ఇంత పెద్దగా 20 ఎకరాల్లో వేసిన ఏకైక సెట్ ఆచార్య సినిమా సెట్ మాత్రమే” అని తెలిపారు. మీరు కూడా ఆ వీడియో ఫై లుక్ వెయ్యండి.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All