Homeరివ్యూస్ఆచారి అమెరికా యాత్ర రివ్యూ

ఆచారి అమెరికా యాత్ర రివ్యూ

Achari America Yatra Reviewనటీనటులు : మంచు విష్ణు , ప్రగ్యా జైస్వాల్ , కోట , బ్రహ్మానందం
సంగీతం : తమన్
నిర్మాతలు : కీర్తి చౌదరి , కిట్టు
దర్శకత్వం : జి . నాగేశ్వర్ రెడ్డి
రేటింగ్ : 2. 5 / 5
రిలీజ్ డేట్ : 27 ఏప్రిల్ 2018

 

- Advertisement -

 

 

దేనికైనా రెడీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మంచు విష్ణు – జి . నాగేశ్వర్ రెడ్డి ల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ” ఆచారి అమెరికా యాత్ర ”. బ్రహ్మానందం కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

కోటీశ్వరుడైన చక్రపాణి ( కోట శ్రీనివాసరావు ) కి మనవరాలు రేణుక ( ప్రగ్యా జైస్వాల్ ) అంటే పంచ ప్రాణాలు దాంతో ఆమె క్షేమం కోరుతూ 9 రోజుల పాటు హోమం నిర్వహిస్తాడు . ఈ హోమానికి అప్పలాచారి ( బ్రహ్మానందం ) కృష్ణమాచారి (మంచు విష్ణు ) బాధ్యులు అయితే
హోమం చివరి రోజున చక్రపాణి చనిపోతాడు అనూహ్యంగా . చక్రపాణి చనిపోవడానికి అప్పలాచారి , కృష్ణమాచారి లు కారణం అని వాళ్ళ ని చంపబోతాడు చక్రపాణి అల్లుడు సుబ్బరాజు ( ప్రదీప్ రావత్ ) . దాంతో అతడి నుండి తప్పించుకోవడానికి అమెరికా వెళ్తారు అప్పలాచారి , కృష్ణమాచారి లు .ఇద్దరు చారిలు అమెరికా కు ఎందుకు వెళ్లారు ? చక్రపాణి చనిపోవడానికి కారణం ఏంటి ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

ప్రగ్యా జైస్వాల్ స్కిన్ షో
మంచు విష్ణు
బ్రహ్మానందం

డ్రా బ్యాక్స్ :

కథ , కథనం

 

నటీనటుల ప్రతిభ :

కృష్ణమాచారి గా మంచు విష్ణు నటన ఫరవాలేదు , గెటప్ విషయంలో పెద్దగా జాగ్రత్తలు ఏమి తీసుకోలేదు ప్రత్యేకత ఏమి చూపించలేదు . ప్రగ్యా జైస్వాల్ నటన తో కంటే గ్లామర్ తో అలరించింది . ఈ సినిమాలో పెద్ద రిలీఫ్ ప్రగ్యా గ్లామర్ అంటే నమ్మండి . ఇక బ్రహ్మానందం కామెడీ కూడా బాగానే ఉంది కానీ అతడి స్థాయి కి తగ్గట్లుగా సరైన సీన్స్ లేకపోవడం . డైలాగ్స్ లేకపోవడం పెద్ద మైనస్ . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు .

ఓవరాల్ గా :

కొత్తదనం లేదు , కామెడీ కూడా అంతగా పేలలేదు …… మంచు విష్ణు కు మరో ప్లాప్ ఎదురయ్యింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All