Homeటాప్ స్టోరీస్సీనియర్ నటిని వేధించిన డ్రైవర్

సీనియర్ నటిని వేధించిన డ్రైవర్

acctress jayachitra complaints on driver ilam muruganతెలుగు , తమిళ చిత్రాల్లో నటించిన సీనియర్ నటి జయచిత్ర దగ్గర నమ్మకంగా పనిచేయడంతో మంచి వాడే కదా అని నమ్మి డ్రైవర్ కు తన ఇంటిని అద్దెకు ఇచ్చింది , అయితే మొదట్లో నమ్మకంగా ఉన్న డ్రైవర్ ఇళం మురుగన్ ఆ తర్వాత తన నిజ స్వరూపం చూపించాడు . సకాలంలో అద్దె చెల్లించకపోవడమే కాకుండా జయచిత్ర ని వేధిస్తూ చేతబడి కూడా చేయించాడట! ఈ విషయాన్నీ తాజాగా వెల్లడిస్తోంది జయచిత్ర . పన్నెండు సంవత్సరాలుగా అద్దె చెల్లించకుండా వేధిస్తున్న మురుగన్ అద్దె ఇవ్వకపోవడమే కాకుండా తనపై చేతబడి కూడా చేయించడంతో తట్టుకోలేని జయచిత్ర అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు కెక్కింది .

అయితే కోర్టులో పన్నెండేళ్ళు గా అద్దె చెల్లిస్తున్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించడంతో ఆగ్రహించిన కోర్టు మురుగన్ ని అదుపులోకి తీసుకోవడమే కాకుండా తక్షణం జయచిత్ర ఇంటిని ఖాళీ చేయాలనీ ఆదేశాలు జారీ చేసింది . ఈనెల 20 లోపు మురుగన్ కుటుంబం ఇల్లు ఖాళీ చేయకపోతే పోలిసుల సహాయంతో నేనే ఖాళీ చేయిస్తానని అంటోంది జయచిత్ర. నమ్మకస్తుడు కావడంతో అతడిని నమ్మానని అయితే అతడు ఇంతటి దారునానికి ఒడిగడతాడని తెలుసుకోలేక్ పోయానని భాధపడుతోంది జయచిత్ర .

- Advertisement -

తెలుగు , తమిళ బాషలతో పాటుగా పలు బాషలలో నటించింది ఈ నటి . అయితే ఇళం మురుగన్ కు నేర చరిత్ర ఉంది , కానీ ఆ విషయం జయచిత్ర కు తెలియకపోవడంతో నమ్మి మోసపోయింది .

English Title: acctress jayachitra complaints on driver ilam murugan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All