Homeటాప్ స్టోరీస్ఎబిసిడి రివ్యూ

ఎబిసిడి రివ్యూ

నటీనటులు : అల్లు శిరీష్ , భరత్ , రుక్సాన్
నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి , యష్ రంగినేని
దర్శకత్వం : సంజీవ్ రెడ్డి
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 17 మే 2019

- Advertisement -

అల్లు శిరీష్ హీరోగా నటించిన చిత్రం ” ఎబిసిడి ” . మలయాళంలో విజయం సాధించిన చిత్రాన్ని అదే పేరుతో రీమేక్ చేసారు . సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ – యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు . ఈరోజు విడుదలైన ఈ చిత్రం మలయాళంలో లాగే ఇక్కడ కూడా హిట్ అవుతుందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

న్యూయార్క్ లో మిలియనీర్ అయిన విద్యాప్రసాద్ ( నాగబాబు ) కొడుకు అరవింద ప్రసాద్ ( అల్లు శిరీష్ ) . ఏమాత్రం పని చేయకుండా జాలీగా నెలకు 20 వేల డాలర్లు ఖర్చు చేస్తూ జల్సా లు చేస్తుంటాడు . దాంతో అతడికి బుద్ది చెప్పడానికి ఇండియాకు పంపిస్తాడు . నెలకు 5000 వేల రూపాయలు మాత్రమే ఖర్చుకి ఇస్తాడు . ఒక్క నెలలో 20 వేల డాలర్లు ఖర్చు చేసే అరవింద్ ప్రసాద్ ఇండియాలో కేవలం నెలకు 5వేలతో ఎలా నెట్టుకొచ్చాడు . చివరకు ప్రయోజకుడు అయ్యాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

అల్లు శిరీష్
భరత్
ఎంటర్ టైన్ మెంట్

డ్రా బ్యాక్స్ :

సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు
బలమైన సన్నివేశాలు లేకపోవడం

 

నటీనటులు :

అల్లు శిరీష్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు . ఫస్టాఫ్ లో నవ్వించిన శిరీష్ సెకండాఫ్ లో కొంత హీరోయిజం కూడా చూపించి మెప్పించాడు . సాలిడ్ హిట్ కోసం తపించిపోతున్న అల్లు శిరీష్ కు ఈ ఎబిసిడి తప్పకుండా కొంత ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది . రిచ్ మెన్ గా గల్లి బాయ్ గా తన క్యారెక్టర్ లో షేడ్స్ చూపించి మెప్పించాడు . అలాగే నటుడిగా కూడా ఒక్కో సినిమాకు చాలా బెటర్ అవుతున్నాడు కూడా . ఇక భరత్ ఇన్నాళ్లు బాలనటుడిగా ఆకట్టుకున్నాడు ఇక ఈ సినిమాతో మరోసారి తన టైమింగ్ తో అలరించాడు . రుక్సార్ కు గ్లామర్ తో పాటుగా నటనకు అవకాశం ఉన్న పాత్ర లభించింది . ఇక మిగిలిన పాత్రల్లో నాగబాబు , రాజా ,వెన్నెల కిషోర్ , శుభలేఖ సుధాకర్ తదితరులు తమతమ పాత్రల పరిధిమేరకు బాగా నటించారు .

సాంకేతిక వర్గం :

మధుర శ్రీధర్ రెడ్డి – యష్ రంగినేని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు . ఇప్పటికే పలు చిత్రాల ద్వారా తమ అభిరుచిని చాటుకున్నారు ఈ నిర్మాతలు . విజువల్స్ బాగున్నాయి , మెల్ల మెల్లగా పాట యువతని బాగా ఆకట్టుకుంటోంది అలాగే మిగతా పాటలు కూడా వినసొంపుగానే ఉన్నాయి . ఇక దర్శకుడు సంజీవ్ రెడ్డి విషయానికి వస్తే ఫస్టాఫ్ ని బాగానే నడిపించినప్పటికీ సెకండాఫ్ కు వచ్చేసరికి మాత్రం కాస్త తడబడ్డాడు . సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే పరంగా మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది .

ఓవరాల్ గా :

ఎంటర్ టైన్ మెంట్ పక్కా

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts