Homeటాప్ స్టోరీస్ఆవిరి మూవీ రివ్యూ

ఆవిరి మూవీ రివ్యూ

ఆవిరి మూవీ రివ్యూ
ఆవిరి మూవీ రివ్యూ

నటీనటులు: రవి బాబు, నేహా చౌహాన్, శ్రీ ముక్తా భరణి, శంకర్ ముఖ్తర్ ఖాన్ తదితరులు
నిర్మాత: రవిబాబు
సంగీతం: వైద్ది
దర్శకుడు: రవిబాబు
విడుదల తేదీ: 1నవంబర్ 2019
రేటింగ్: 2/5

ఒక థ్రిల్లర్ జోనర్, ఒక లవ్ ఎంటర్టైనర్.. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా సాగిపోయేది రవి బాబు దర్శకత్వ కెరీర్. అయితే ఈ మధ్య రవిబాబు నుండి ఆశించే రేంజ్ అవుట్ పుట్ రావట్లేదు. అందుకే జోనర్ తో సంబంధం లేకుండా అతని సినిమాలన్నీ పల్టీ కొడుతున్నాయి. అదుగో చిత్రంతో దారుణంగా విఫలమైన రవిబాబు చేస్తోన్న మరో ప్రయత్నం ఆవిరి. మరి ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.

- Advertisement -

కథ:
రాజ్ కుమార్ రావు (రవిబాబు), లీనా (నేహా చౌహాన్) భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు. వారిది చింత లేని కుటుంబం. అయితే ఉన్నట్టుండి ఇద్దరు పిల్లల్లో ఒకరు ఆస్త్మా అటాక్ తో చనిపోతారు. అయితే అప్పటినుండి మరో అమ్మాయికి కొన్ని వింత అనుభవాలు ఎదురవుతాయి. ఒకరోజు ఆ అమ్మాయి కనిపించకుండా.పోతుంది. అప్పుడు రాజ్ కుమార్ రావు, అతని భార్య ఏం చేసారు? అసలు ఆ అమ్మాయికి ఎదురైన వింత అనుభవాలు ఏంటి? తప్పించుకుపోయిన అమ్మాయికి ఏం జరిగింది వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:
రాజ్ కుమార్ రావుగా రవిబాబు నటన బాగుంది. ఇంటికి, వర్క్ కు మధ్య నలిగిపోయే వ్యక్తి పాత్రలో మెప్పిస్తాడు. తన కూతురు కనిపించకుండా పోయిన దగ్గర నుండి వచ్చే సీన్లలో రవిబాబు నటన ఆకట్టుకుంటుంది. నేహా చౌహాన్ నటన మెలోడ్రమాటిక్ గా అనిపిస్తుంది. సీరియల్ ఆర్టిస్ట్ తరహాలో కొన్ని చోట్ల ఓవర్ గా చేసేసింది. ఆత్మ ఆవరించాక ఆమె నటన భయపెట్టకపోగా నవ్విస్తుంది. అయితే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ను ఎదుర్కొంటున్న పిల్లగా చేసిన అమ్మాయి నటన చాలా బాగుంది. ఆమె ఎక్స్పర్శన్స్ ఆకట్టుకుంటాయి. హుషారు ఫేమ్ ప్రియా వడ్లమాని ఉన్న కాసేపట్లో బానే చేసింది. భరణి శంకర్, ముఖ్తర్ ఖాన్ పర్వాలేదు. మిగిలిన వారంతా ఓకే.

సాంకేతిక నిపుణులు:
ముందుగా ఆవిరి గురించి మాట్లాడుకుంటే నిర్మాణ విలువలే గుర్తొస్తాయి. చాలా ఉన్నతంగా తెరకెక్కిన భావన కలిగిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక స్థాయి వరకూ బానే ఉంది. తర్వాత రొటీన్ గా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. హౌజ్ కు వాడిన కలర్స్ అన్నీ రవిబాబు టేస్ట్ కు తగ్గట్లు ఉన్నాయి. ఈ సినిమా స్టోరీ లైన్ బాగున్నా స్క్రీన్ ప్లే సాఫీగా సాగదు. లాజిక్ కు దూరంగా చాలా సన్నివేశాలు మనల్ని విసిగిస్తాయి. మిగిలిన సన్నివేశాలు రొటీన్ గా అనిపించి బోర్ కొట్టిస్తాయి. దర్శకత్వంలో కూడా రవిబాబు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఎడిటింగ్ అయితే దాదాపు పావుగంట సినిమా నిర్దాక్షిణ్యంగా కోసేసి పారేయొచ్చు.

చివరిగా:
రవిబాబు సినిమాలకి ప్రత్యేకంగా ఫాలోయింగ్ రావడానికి కారణంఅతని సరికొత్త ఆలోచనలే. అయితే ఇప్పుడు ఆవిరి సినిమాకి అవే కొరవడిన ఫీలింగ్ కలుగుతుంది. ఆవిరి లో కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. అవును సినిమాతో భలేగా థ్రిల్ చేసిన రవిబాబు ఈసారి పూర్తిగా దారి తప్పాడు. ఇందులో చూపించిన థ్రిల్స్ లో ఏ మాత్రం కొత్తదనం లేదు. బోర్ కొట్టించే థ్రిల్లర్ ను ఈ వీకెండ్ స్కిప్ చేయడమే ఉత్తమం.

ఆవిరి – చూసేవాళ్ళు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All