Homeటాప్ స్టోరీస్ఆర్ ఎక్స్ 100 తమిళ్ హీరో ఎవరో తెలుసా

ఆర్ ఎక్స్ 100 తమిళ్ హీరో ఎవరో తెలుసా

aadi pinisetty to remake RX100 in tamilతెలుగునాట గత నెలలో విడుదలై సంచలన విజయం సాధించిన ఆర్ ఎక్స్ 100 చిత్రం ఇప్పుడు తమిళ్ లో రీమేక్ అవుతోంది . తెలుగులో సూపర్ హిట్ కావడంతో రీమేక్ కోసం పలువురు పోటీ పడ్డారు . కాగా ఆది పినిశెట్టి భారీ ఆఫర్ ఇచ్చి తమిళ హక్కులు సొంతం చేసుకున్నాడు . అయితే ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీ గా ఉన్నందున రీమేక్ కొంత సమయం పట్టేలా ఉంది , దాంతో తమిళ సినిమాకు కూడా మీరే దర్శకత్వం వహించాలని ఈలోపు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయండని దర్శకులు అజయ్ భూపతి ని కోరాడట ఆది పినిశెట్టి .

అయితే ఆది ఆఫర్ ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాడట అజయ్ భూపతి , ఎందుకంటే ఆ దర్శకుడికి తమిళ్ రాదు కాబట్టి భాష రాకుండా డైరెక్షన్ చేయడం బాగుండదని అందుకే నో చెప్పాడట ! దాంతో ఆర్ ఎక్స్ 100 కి డైరెక్టర్ ని వెతుక్కునే పనిలో పడ్డాడు ఆది . తెలుగు చిత్రాల్లో మాత్రమే కాకుండా తమిళ్ చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు ఆది . అక్కడ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఈ హీరో .

- Advertisement -

English Title: aadi pinisetty to remake RX100 in tamil

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All