
దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు నటుడు ఆది పినిశెట్టి నిశ్చితార్థం హీరోయిన్ నిక్కీ గల్రానీతో అట్టహాసంగా జరిగింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశంపై వీరిద్దరూ అధికారికంగా స్పందించలేదు. తమకు ఎంగేజ్ మెంట్ జరిగినట్టు తెలిపి షాక్ ఇచ్చారు.
జీవితంలో ఒకరినొకరు పట్టుకుని నడవడం అతి ముఖ్యమైంది. అలా జీవితాంతం ఉండగలమనే విషయాన్ని మేం ఇద్దరం గత కొన్నేళ్ల క్రితమే కనుగొన్నాం. ఇప్పుడు అది అధికారకమైంది.. 24.03.2022 మాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. కుటుంబ సభ్యుల సమక్షంలో మా నిశ్చితార్థం జరిగింది. మా ఈ కొత్త జర్నీకి మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలి అంటూ ఆది ట్వీట్ వేశాడు.
- Advertisement -