
‘హార్ట్ ఎటాక్’ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆదా శర్మ..మొదటి సినిమాతోనే తన గ్లామర్ తో యూత్ కు హార్ట్ ఎటాక్ తెప్పించింది. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం, సుబ్రమణ్యం ఫర్ సేల్, కల్కి తదితర చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైంది. కానీ పెద్ద హీరోల పక్కన ఛాన్సులు రాకపోయేసరికి బిజీ హీరోయిన్ కాలేకపోయింది.
ఇదే సమయంలో కొత్త భామల ఎంట్రీ ఇవ్వడం..ఆ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు కావడం తో నిర్మాతలు ఆదాను పట్టించుకోవడం మానేశారు. అయినప్పటికీ ఈమె తనవంతు కృషి చేస్తూనే ఉంది. సోషల్ మీడియా ను గట్టిగా నమ్ముకొని, ఎప్పటికప్పుడు హాట్ హాట్ వీడియోస్ తో పిక్స్ తో ఫాలోయర్స్ ను అలరిస్తూవస్తోంది.
తాజాగా డస్ట్‌బిన్ తో డాన్స్ చేసి వైరల్ గా మారింది. ఈ వీడియోలో సరికొత్త ట్రెండీ కలర్ బ్లాక్ కలర్ దుస్తులు, హైహీల్స్‌లో ఎంతో అందంగా కనిపించిన అదా.. రెండు పాలిథిన్ సంచుల్లో చెత్తను తీసుకొచ్చి డస్ట్‌బిన్ లో పడేస్తుంది. అనంతరం వాటిని పట్టుకుని వివిధ పోజుల్లో డ్యాన్స్ చేస్తుంది. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది.
View this post on Instagram