
ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తోన్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు అందించింది జగన్ ప్రభుత్వం. పదోన్నతులకి లైన్ క్లియర్ చేస్తూ కేబినెట్ డెసిషన్ తీసుకుంది. సర్కార్ నిర్ణయంతో సంబరాల్లో మునిగితేలారు ఉద్యోగులు. అమరావతి సచివాలయంలో ప్రభుత్వం కొత్తగా 85పోస్టులు క్రియేట్ చేసింది. వాటిని ప్రమోషన్లతో భర్తీ చేసుకునే ఛాన్స్ కల్పించింది. నిజానికి సచివాలయంలో పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా ఏఎస్‌ఓ కేడర్ నుంచి భర్తీ చేస్తారు.
రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ హయాంలో ఒకసారి.. వైసీపీ ప్రభుత్వంలో మరోసారి ప్రభుత్వ విరమణ వయసు రెండేళ్లు పెంచారు. దీంతో రిటైర్మెంట్ ఏజ్ 62కు పెరిగింది. పైస్థాయి అధికారులు ఉద్యోగ విరమణ చేయకపోవడంతో కిందిస్థాయి ఏఎస్‌ఓ, ఎస్‌ఓ స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లకు అవకాశం లేకుండాపోయింది. లేటెస్ట్‌గా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పదోన్నతులకి లైన్ క్లియర్ అయింది. 85 పోస్టుల్లో 55 మంది సెక్షన్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీలుగా ప్రమోషన్ రానుంది.
మరో 30మంది ఎస్‌ఓలకు అసిస్టెంట్, డిప్యూటీ, జాయింట్, అడిషనల్ సెక్రటరీలుగా పదోన్నతికి అవకాశముంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే.. సీఎం జగన్ అధ్యక్షతన దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశాల్లో పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు, సచివాలయంలో 83 కొత్త పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది.
కియా పరిశ్రమ రిజిస్ట్రేషన్లు ఫీజుల్లో మార్పులు చేసింది. ఏపీలో కొత్తగా 4 శాశ్వత అదాలత్‌లు ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన సిబ్బంది నియామకం చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ చారిటబుల్ ట్రస్టుకు ఆమోదం. అల్లూరి జిల్లా చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. తిరుపతిలో నొవాటెల్ బ్రాండ్ పేరుతో 5 స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. కొత్తగా ఏర్పడిన 24 రెవెన్యూ డివిజన్లలో 456 కొత్తపోస్టుల ఏర్పాటుకు, భావనపాడు పోర్టు విస్తరణకు ఆమోదం తెలిపింది.