
రెహమాన్.. భారతీయ సినీ వినీలాకాశంలో ఉవ్వెత్తున ఎగిసిన సంగీత తరంగం. దేశ వ్యాప్తంగా తనదైన మార్కు సంగీతంతో యువతని, విమర్శకులని ఊర్రూతలూగించారు. `స్లమ్ డాగ్ మిలియనీర్` చిత్రంతో భారతీయుల చిరకాల స్వప్నమైన అకాడమీ అవార్డుని దక్కించుకుని చరిత్ర సృష్టించారు. గత కొంత కాలంగా తనకు నచ్చిన చిత్రాలకు మాత్రమే సంగీతం అందిస్తున్నారాయన.
ప్రస్తుతం మణిరత్నం `పొన్నియన్ సెల్వన్`తో పాటు శివకార్తికేయన్ నటిస్తున్న `అయాలన్` చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా వుంటే రెహమాన్ నిర్మాతగా మారి జీయో స్టూడియోస్‌తో కలిసి `99 సాంగ్స్` పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. సంగీత ప్రధానంగా సాగే రొమాంటిక్ ప్రేమకథగా ఈ చిత్రాన్ని విశ్వేష్ కృష్ణమూర్తి రూపొందించారు. ఇహాన్ భట్, ఎడీల్‌సీ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 16న రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా రెహమాన్ మూవీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చారు. మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా రెహమాన్ వేసుకున్న షూస్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. కింది సోల్ భాగం గ్లాస్‌తో కవర్ చేసి వుంది. ఈ తరహా షూస్‌ని ఇంత వరకు ఎవరూ వాడలేదు. తొలిసారి రెహమాన్ వాడటంతో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఈ షూస్ ఏంటీ? దీని కాస్ట్ ఎంతా అని నెటిజన్స్ నెట్టింట సెర్చ్ చేస్తున్నారు.