Homeటాప్ స్టోరీస్ఎ.ఆర్ రెహమాన్ సామాజిక బాధ్యత

ఎ.ఆర్ రెహమాన్ సామాజిక బాధ్యత

ఎ.ఆర్ రెహమాన్ సామాజిక బాధ్యత
ఎ.ఆర్ రెహమాన్ సామాజిక బాధ్యత

“కళ మన కోసం కాదు, జనం కోసం” అని ఒకానొక సందర్భంలో ఒక మహానుభావుడు అన్న మాట అక్షర సత్యం. మనకు ఉన్న 64 కళల ముఖ్య ఉద్దేశ్యం వాటి ద్వారా ఒక బలమైన,నిజమైన, మంచి సమజానికి ఉపయోగపడే జ్ఞానం అందించడమే. ఇక వీటిలో సంగీత, సాహిత్యాలది అగ్ర స్థానం. ఏ మాటనైనా పాట ద్వారా చెప్తే అది కొన్ని తరాల పాటు నిలిచిపొతుంది.

తన విలక్షణ సంగీతంతో ఇండియాలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ అప్పుడప్పుడు సామాజిక ఇతివృత్తం ఉన్న పాటలు కూడా చేస్తూ ఉంటాడు. ఆయన స్వరపరిచిన వందేమాతరం ఆల్బం ఇప్పటికీ ఒక సంచలనమే. ఆయన చేసే సినిమాల్లో కూడా కొన్ని పాటలు కేవలం, ఆయనకే సాధ్యం అనే విధంగా ఉంటాయి. గతంలో అందరూ ఐకమత్యంగా ఉండాలని “జియా సే జియా” అనే పాట కూడా కంపోజ్ చేసారు.

- Advertisement -

ఇప్పుడు రెహ్మాన్ సర్ “నీటి పొదుపు” నీటి ఆవశ్యకత అనే అంశంపై ఒక కొత్త పాట చేసి రిలీజ్ చెయ్యబోతున్నారు. పదేళ్ళ క్రితం ఒక పెద్దాయన తన సినిమాలో హీరో ఇంట్రడక్షన్ ఫైట్, మంచి నీళ్ళ కోసం పెడితే అర్ధం కాక అందరూ ఎగతాళి చేసారు. అదే 10 ఏళ్ళ తరువాత ఇంకొక హీరో సినిమాలో పెద్ద డైలాగ్ అయ్యింది. ప్రస్తుత పరిస్థితులకు ఆ డైలాగ్ సరిగ్గా సరిపోతుంది. “మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే, అది నీళ్ళ కోసమే అని చెప్తుంటే నమ్మలేదు. కానీ ఇప్పుడు నమ్మక తప్పట్లేదు” .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All