
స్టార్ ప్రొడ్యూసర్ తన బ్యానర్ పేరుని మార్చేశారు. తన సంస్థలో ఎన్నో మరపు రాని విజయాల్ని, సంచలన చిత్రాల్ని అందించిన ఆయన తాజాగా బ్యానర్ పేరునే పూర్తిగా మార్చేశారు. ఆయనే స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం. శ్రీసూర్యామూవీస్ బ్యానర్‌పై ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ తో జెంటిల్‌మెన్, భారతీయుడు, ప్రేమికుడు, ఒకే ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్ని అందించి భారీ చిత్రాలకు ఒక దశలో కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారయన.
పెద్దరికం, కర్తవ్యం, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌తో ఖుషీ, బంగారం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్ని అందించారు. అయితే తనయుడు రవికృష్ణతో చేసిన చిత్రాల్నీ బాక్సాఫీస్ వద్ధ డిజాస్టర్‌గా నిలవడంతో కోట్లు నష్టపోయారు. ఆ తరువాతే తన బ్యానర్ నేమ్‌ని మార్చి అజిత్ నటించిన `ఆరంభం, ఎన్నై అరిందాల్`, వేదాలం చిత్రాలతో మళ్లీ తన పూర్వపు వైభవాన్ని సొంతం చేసుకున్నారు.
శ్రీ సూర్యా మూవీస్‌పై అత్యుత్తమ చిత్రాల్ని అందించిన ఏ.ఎం. రత్నం తాజాగా పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయి పిరియాడిక్ ఫిల్మ్‌ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో తెలుగులోనూ తన పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవాలనే ప్రయత్నాల్లో వున్నారు ఏ.ఎం. రత్నం.