Homeటాప్ స్టోరీస్డాల్బీ థియేట‌ర్లో ఆస్కార్ హంగామా!

డాల్బీ థియేట‌ర్లో ఆస్కార్ హంగామా!

92 OSCARS Awards
92 OSCARS Awards

ప్ర‌పంచ సినీరంగానికి  ఆస్కార్ ఓ క‌ల‌. ఈ ప్ర‌తిష్టాత్మ‌క అకాడ‌మీ అవార్డుని అందుకోవాల‌ని ఆ క్ష‌ణాల కోసం చాలా మంది న‌టీన‌టులు ఆశ‌గా ఎదురుచూస్తుంటారు. ఆ ఆస్కార్ పండ‌గ రానే వ‌చ్చింది. 92వ ప్ర‌తిష్టాత్మ‌క అకాడ‌మీ అవార్డ్ ల ప్ర‌దానోత్స‌వ సంబ‌రం అమెరికా లాస్ ఎంజీల్స్‌లోని డాల్బీ థియేట‌ర్‌లో ఈ సోమ‌వారం ఉద‌యం అట్ట‌హాసంగా మొద‌లైంది. తార‌ల త‌ళుకుల మ‌ధ్య.. రెడ్ కార్పెట్‌పై హొయ‌లొలికిస్తూ అందాల భామ‌లు సంద‌డి చేశారు. హాలీవుడ్ భామ‌ల వెరైటీ ఫ్యాన్ డ్రెస్సుల్లో మిరుమిట్లు గొలిపే వారి అందాలు ఆస్కార్‌కు మ‌రింత వ‌న్నె తెచ్చాయి.

అట్ట‌హాసంగా మొద‌లైన ఈ కార్య‌క్ర‌మానికి హాలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖులంతా హాజ‌ర‌య్యారు. ఈ పుర‌స్కారాల్లో మొత్తం 9 చిత్రాలు అవార్డుల్ని ద‌క్కించుకున్నాయి.  `జోక‌ర్` సినిమాలో న‌ట‌న‌కు గాను జాక్వ‌లిన్ ఫీనెక్స్ ఉత్త‌మ న‌టుడిగా ఎంపిక‌య్యారు.  జూడీ చిత్రానికి గానూ రెనీజెల్ వెగ‌ర్ ఉత్త‌మ న‌టి పుర‌స్కారాన్ని సొంతం చేసుకుంది. ఉత్త‌మ చిత్రంగా `పారాసైట్‌`. `వ‌న్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్‌` చిత్రానికి గానూ ఉత్త‌మ స‌హాయ న‌టుడిగా బ్రాడ్‌పీట్ అవార్డు అందుకున్నారు. ఉత్త‌మ యానిమేష‌న్ చిత్రంగా `టాయ్‌స్టోరీ-4` నిలిచింది.

- Advertisement -

అవార్డు విజేత‌లు:
ఉత్త‌మ చిత్రం : పారాసైట్‌
ఉత్త‌మ న‌టుడు : జోక్విన్ ఫీనిక్స్ (జోక‌ర్‌)
ఉత్త‌మ న‌టి : రెనీజెల్ వెగ‌ర్ (జూడి)
ఉత్త‌మ స‌హాయ న‌టుడు : బ‌్రాడ్‌పీట్‌ (వ‌న్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్‌)
ఉత్త‌మ స‌హాయ‌న‌టి : ల‌ఆరా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ)
ఉత్త‌మ ద‌ర్శ‌కుడు : బాంగ్ జోన్ హు (పారాసైట్‌)
ఉత్త‌మ సంగీతం : జోక‌ర్ (హాల్దార్‌)
బెస్ట్‌మ్యూజిక్ ఒరిజిన‌ల్ సాంగ్ : ఐయామ్ గొన్నా… అవ్ మీ ఎగైన్ (రాకెట్ మ్యాన్‌)
ఉత్త‌మ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫీచ‌ర్ ఫిల్మ్ : పారాసైట్‌
మేక‌ప్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ : బాంబ్ షెల్‌
ఉత్త‌మ డాక్యుమెంట‌రీ : అమెరిక‌న్ ఫ్యాక్ట‌రీ
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే :   టైకా వైటిటి (జోగో ర్యాబిట్‌)
బెస్ట్ యానిమేటెడ్ ఫీచ‌ర్ ఫిల్మ్ : టాయ్‌స్టోరీ 4
బెస్ట్ లైవ్ యాక్ష‌న్ షార్ట్ : ది నైబ‌ర్స్ విండో
ఉత్త‌మ ఒరిజిన‌ల్ స్క్రీన్‌ప్లే : బాంగ్ జూన్ (పారాసైట్‌)
ఉత్త‌మ డాక్యుమెంట‌రీ షార్ట్ : లెర్నింగ్ ర్నింగ్ టూ స్క్వేర్‌బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ (ఇఫ్ యు ఆర్ ఏ గార్ల్‌)
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ : హెయిర్ ల‌వ్‌
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ :  ఫోర్ట్ వి ఫెరారీ
బెస్ట్ సౌండ్ మిక్సింగ్ : 1917
ఉత్త‌మ సినిమాటోగ్ర‌ఫీ : 1917
బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ :  ఫోర్ట్ వి ఫెరారీ
ఉత్త‌మ ప్రొడ‌క్ష‌న్ డిజైన్ : వ‌న్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్‌
ఉత్త‌మ లైవ్ యాక్ష‌న్ షార్ట్ ఫిల్మ్ :  ది నైబ‌ర్స్ విండో

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All