Homeటాప్ స్టోరీస్80 కోట్ల షేర్ రాబట్టిన మహర్షి

80 కోట్ల షేర్ రాబట్టిన మహర్షి

మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లో 160 కోట్ల గ్రాస్ 80 కోట్ల షేర్ రాబట్టింది . నైజాం లో అయితే మహేష్ బాబు కలెక్షన్లతో అదరగొడుతున్నాడు . ఇక్కడ దిల్ రాజుకు వసూళ్ల వర్షం కురుస్తోంది . ఇప్పటికే 22 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి రంగస్థలం రికార్డ్ ని బద్దలు కొట్టేందుకు శరవేగంగా దూసుకుపోతోంది . అయితే సీడెడ్ లో మాత్రం మహర్షి కి చెక్కెదురు అయ్యింది . ఆశించిన స్థాయిలో అయితే వసూళ్లు లేవు .

- Advertisement -

అలాగే ఓవర్ సీస్ లో కూడా బయ్యర్ కు నష్టం తప్పేలా కనిపించడం లేదు . అయితే ఓవరాల్ గా చూస్తే 80 కోట్లకు పైగా షేర్ సాధించడం అంటే మాటలు కాదు మహేష్ కున్న క్రేజ్ తో ఈ వసూళ్లు సాధ్యమయ్యాయి కాకపోతే బడ్జెట్ ఎక్కువ కావడం అలాగే బయ్యర్ లకు ఎక్కువ మొత్తం లో అమ్మడంతో కొంతమంది బయ్యర్ లు నష్టపోయేలా ఉన్నారు . మహేష్ బాబు కు మరో పోటీ చిత్రం ఏది లేదు కాబట్టి అవలీలగా 95 నుండి వంద కోట్ల షేర్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది . దాంతో దాదాపుగా బయ్యర్ లు అందరూ సేఫ్ అవుతారు ఓవర్ సీస్ , రాయలసీమ బయ్యర్ లు తప్ప .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All