Tuesday, August 16, 2022
Homeన్యూస్4 లెటర్స్ రివ్యూ

4 లెటర్స్ రివ్యూ

4 Letters movie review4 లెటర్స్ రివ్యూ

- Advertisement -

నటీనటులు : ఈశ్వర్ , టువ చక్రవర్తి , అంకిత మహారాణా

సంగీతం : భీమ్స్

పాటలు : సురేష్

నిర్మాతలు : దొమ్మరాజు హేమలత – దోమరాజు ఉదయ్ కుమార్

దర్శకత్వం : ఆర్ . రఘురాజ్

రేటింగ్ : 3/5

రిలీజ్ డేట్ : 22 ఫిబ్రవరి 2019

 

రెండు దశాబ్దాల క్రితం కలుసుకోవాలని చిత్రానికి దర్శకత్వం వహించిన ఆర్ . రఘురాజ్ చాలాకాలం తర్వాత మళ్ళీ మెగాఫోన్ పట్టిన చిత్రం

” 4 లెటర్స్ ”. ఈశ్వర్ , టువ చక్రవర్తి , అంకిత మహారాణా హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ 4 లెటర్స్ ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

 

కథ :

 

అజయ్ ( ఈశ్వర్ ) వందల కోట్లకు వారసుడు అంతేకాదు బ్రిలియంట్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా . యితడు అడిగే ప్రశ్నలకు లెక్చరర్ లే సమాధానాలు చెప్పలేక భయపడిపోతుంటారు . అంజలి ( టువ చక్రవర్తి ) కి సంగీతంలో మేస్ట్రో అవ్వాలని గోల్ గా పెట్టుకుంటుంది  , అయితే అనుకోని తప్పు వల్ల అజయ్ చెప్పినట్లు చేయాల్సి వస్తుంది . తన గోల్ కోసం అజయ్ ని ప్రేమించినప్పటికీ అతడికి దూరం అవుతుంది అంజలి . సరిగ్గా అదేసమయంలో మరో అమ్మాయి అజయ్ లైఫ్ లోకి వస్తుంది . ఈ ఇద్దరు అమ్మాయిల్లో అజయ్ ఎవరిని ప్రేమించాడు ? ఎవరిని పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యాడు ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

 

హైలెట్స్ :

 

ఈశ్వర్ డ్యాన్స్ , యాక్టింగ్

టువ చక్రవర్తి గ్లామర్

అంకిత మహారాణా గ్లామర్ షో

అడల్ట్ జోక్స్

పాటలు

 

డ్రా బ్యాక్స్ :

 

శృతి మించిన జోక్స్

 

నటీనటుల ప్రతిభ :

 

హీరో గా పరిచయమైన ఈశ్వర్ మంచి నటనని ప్రదర్శించాడు . అలాగే డ్యాన్స్ లో కూడా రాణించాడు అంతేకాదు మొదటి సినిమాలోనే ఓ పాత కూడా పాడి మెప్పించాడు . నటనకు కొత్త అయినప్పటికీ ఎక్కడా తడబడకుండా నటించి మెప్పించడం మాములు విషయం కాదు . అలాగే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం అంటే తప్పకుండా ఈశ్వర్ ని అభినందించాల్సిందే . ఇక హీరోయిన్ లుగా నటించిన అందమైన ముద్దుగుమ్మలు టువ చక్రవర్తి , అంకిత మహారాణా లు నటనతోనే కాకుండా గ్లామర్ తో కూడా ఆకట్టుకున్నారు . ముఖ్యంగా అంకిత మహారణా అయితే స్కిన్ షోతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది . మిగిలిన పాత్రల్లో ధనరాజ్ , విద్యుల్లేఖ , సురేష్ , కౌసల్య , అన్నపూర్ణ , పోసాని , వేణు , మహేష్ విత్తా , సత్యకృష్ణ , సుధా లు మెప్పించారు .

 

సాంకేతిక వర్గం :

 

సురేష్ ఉపాధ్యాయ అందించిన నాలుగు పాటలు బాగున్నాయి , ముఖ్యంగా యువతకు మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయి . సురేష్ రాసిన పాటలకు భీమ్స్ స్వరపరిచిన బాణీలు యువతని ఓ ఊపు ఊపేస్తున్నాయి . భీమ్స్ పాటలకు కిక్ ఇచ్చేలా బాణీలు అందించడమే కాకుండా నేపథ్య సంగీతంతో కూడా ఆకట్టుకున్నాడు . చిట్టిబాబు విజువల్స్ బాగున్నాయి . ముఖ్యంగా హీరోయిన్ ల అందాలను ఒడిసి పట్టుకోడంలో అందవేసిన చేయి చిట్టిబాబు ది . నిర్మాణ విలువలు బాగున్నాయి . హేమలత – ఉదయ్ కుమార్ లు ఖర్చుకు వెనుకాడకుండా ఖర్చు పెట్టిన తీరు ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తుంది . ఇక దర్శకుడు రఘురాజ్ విషయానికి వస్తే …… యువతకు కావాల్సిన మసాలని అందించి మాంచి కిక్ ఇచ్చాడు . అడల్ట్ జోక్స్ తో యూత్ ని టార్గెట్ చేసాడు .

 

ఓవరాల్ గా :

 

కుర్రకారు మెచ్చే 4 లెటర్స్

 

English Title: 4 Letters movie review

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts