Homeటాప్ స్టోరీస్30 సంవత్సరాల క్రింద సైకిల్ చైన్ కథ...

30 సంవత్సరాల క్రింద సైకిల్ చైన్ కథ…

30 సంవత్సరాల క్రింద సైకిల్ చైన్ కథ...
30 సంవత్సరాల క్రింద సైకిల్ చైన్ కథ…

కొంతమంది దర్శకులు మన తెలుగు చిత్ర పరిశ్రమలో అణిగిమణిగి ఉంటారు.కొందరు కథ ని నమ్మి ఎవ్వరి మాట వినకుండా వారి పని వారు చేసుకొని వెళ్ళిపోతారు. ఇంకొందరు నిర్మాతలే దేవుళ్ళు కాబట్టి వాళ్ళ మాట మాత్రమే వింటారు, కానీ ‘రామ్ గోపాల్ వర్మ‘ మాత్రం ఒకసారి కథని నమ్మితే తన మాట కూడా వినరు. అలాంటి డేరింగ్ మరియు డాషింగ్ వర్మ గారు తీసిన 30 సంవత్సరాల క్రితం సినిమా ఇది.

అక్కినేని నాగర్జున తో కలిసి చేసిన ”శివ” సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. సినిమాలో ఒక సన్నివేశం దగ్గర నాగార్జున రౌడీ లతో గొడవ పడేటప్పుడు సైకిల్ చైన్ ని తెంపేస్తాడు. మొత్తం సినిమాలో మనకి ఆ ఒక్క సన్నివేశం మాత్రమే గుర్తుంది అంటే అది ‘రామ్ గోపాల్ వర్మ’ అని చెప్పవచ్చు. 1989 అక్టోబర్ 05 న విడుదల అయిన ఈ సినిమా నేటితో 30 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.

- Advertisement -

ఈ విషయాన్ని వర్మ గారు ట్విట్టర్ ద్వారా నాగార్జునని టాగ్ చేసి మరీ చెపుతున్నారు. “హే నాగార్జున చూడు మన సినిమా (బిడ్డ) పుట్టి 30 సంవత్సరాలు అయ్యింది” అని అన్నాడు. తను ట్విట్టర్ లో కూడా పలు సంచలనాలు పుట్టిస్తాడు అని మనకి తెలిసిందే కదా. వర్మ గారి సినిమాలు కూడా దాదాపు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ పరిశ్రమలలో కలిపి 60 సినిమాలకి దర్శకత్వం చేసిన వర్మ గారి కెరీర్ లో ”శివ” సినిమా పరుపురాని తీపి గుర్తు.

ఇక నాగార్జున గారి కెరీర్ కూడా అప్పుడు అంతగా లేదు…ఒక్కసారి శివ సినిమా ద్వారా తానేంటో నిరూపించుకున్నాడు. అక్కినేని అమల గారి ‘ఆశ’ (శ్రీమతి) క్యారక్టర్ కూడా సినిమాకి మంచి బలం అయ్యింది. ఇక ‘రఘువరన్’ గారి విలన్ క్యారక్టర్ ని ఎలా మర్చిపోగలము చెప్పండి. భవాని అని పేరు ఇప్పటికి గుర్తుంది అంటే అంతలా జీవించేసారు అని చెప్పవచ్చు. ఇళయరాజా గారి సంగీతం కూడా మనసుని పులకరింప చేస్తుంది.

అక్కినేని అభిమానులకి మాత్రం శివ సినిమా ఒక మంచి అనుభవం అని చెప్పవచ్చు. ట్విట్టర్ లో కూడా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All