
ప్రస్తుతం ఓటిటి సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది. థియేటర్స్ లలో విడుదలైన నెల రోజుల లోపే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుండడం తో ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లడం చాల తగ్గించారు. థియేటర్స్ కు వెళ్లి వేల రూపాయిలు ఖర్చు పెట్టి సినిమా చూడడం కన్నా..హ్యాపీ గా ఇంట్లోనే కుటుంబ సభ్యులతో సినిమా ను చూడడం బెటర్ అని ఫీల్ అవుతున్నారు. అందుకే పలు ఓటిటి సంస్థలు కూడా భారీ ధర లకు సినిమాల డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇక ఈ వారం ఓటిటి లలో అదిరిపోయే మూవీస్ స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యాయి.
‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’, ‘రాధే శ్యామ్’, ‘హే సినామిక’ చిత్రాలు ఈ వారం డిజిటల్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ప్రభాస్ నటించిన “రాధే శ్యామ్” విషయానికి వస్తే.. ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ చిత్రం మార్చ్ 11న థియేటర్లలోకి వచ్చింది. అయితే అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ పెద్దగా టైం తీసుకోకుండానే ఓటిటిలో విడుదలకు రెడీ అయ్యింది. ఏప్రిల్ 1వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో ‘రాధేశ్యామ్’ రిలీజ్ కానుందని ప్రకటించేశారు. ఇక శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఆడవాళ్లు మీకు జోహార్లు” ఏప్రిల్ 2న సోనీ లివ్‌లో ప్రీమియర్ అవుతుంది. ఇక మరో మలయాళ చిత్రం దుల్కర్ సల్మాన్, అదితి రావు, కాజల్ నటించిన ‘హే సినామిక’ ఏప్రిల్ 1న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌గా కానుంది. ఈ మూడు చిత్రాలు కూడా థియేటర్స్ లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. మరి ఓటిటి ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాయి చూడాలి.