Sunday, August 14, 2022
Homeటాప్ స్టోరీస్బర్త్ డే స్పెషల్ : త్రివిక్రమ్ 21 బెస్ట్ డైలాగ్స్

బర్త్ డే స్పెషల్ : త్రివిక్రమ్ 21 బెస్ట్ డైలాగ్స్

21 best dialogues of trivikram srinivas
21 best dialogues of trivikram srinivas

త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మాటల మాంత్రికుడు, గురూజీ అన్న పేర్లు ప్రేక్షకుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. తన డైలాగుల్లో లైఫ్ లెసన్స్ చెప్పే త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాసలకు కూడా పెట్టింది పేరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన రాసిన డైలాగుల్లోనుండి కొన్ని బెస్ట్ ఇక్కడ ఇస్తున్నాం చూడండి.

- Advertisement -

* సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు.

* అందరూ యుద్ధంలో గెలవడం, ఓడడం చూస్తారు .. అంతా అయిపోయాక ఏడవడం ఎవరికీ జ్ఞాపకం రాదు.

* యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు ఓడించడం.

* ప్రేమంటే తేలికగా మర్చిపోయే సంఘటన కాదు, బ్రతికినంత కాలం గుర్తించుకోవాల్సిన జ్ఞాపకం.

* వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులు అయిపోయినట్లు, ఫెయిల్ అయిన హీరోలందరూ ఫ్రెండ్స్ కాలేరు.

* పలావ్ మిగిలిపోతే పాలేరులు తింటారు సర్.. కానీ ఆడపిల్ల పుట్టింట్లో మిగిలిపోతే మీరు ప్రశాంతంగా ఒక్క ముద్ద కూడా తినలేరు.

* పని చేసి జీతం అడగొచ్చు, అప్పు చేసి వడ్డీ అడగొచ్చు, కానీ హెల్ప్ చేసి థాంక్స్ అడగకూడదు.

* కూతుర్ని కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపించి కన్నీళ్లు పెట్టుకోవడం కాదు, మోసపోయి కన్నవాళ్ళ దగ్గరకొస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.

* తండ్రికి, భవిష్యత్తుకి భయపడనివాడు జీవితంలో పైకి రాడు.

* అందంగా ఉండటం అంటే మనకు నచ్చినట్టు ఉండడం కానీ ఎదుటివారికి నచ్చేలా ఉండటం కాదు.

* బాగుండడం అంటే బాగా ఉండటం కాదు నలుగురితో ఉండడం నవ్వుతూ ఉండడం.

* మనుషులు పుట్టాకే సంప్రదాయాలు పుట్టాయి, సంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు.

* గుడిలో దేవుడిని, కన్న తల్లితండ్రులను మనమే వెళ్లి చూడాలి, వాళ్ళు మన దగ్గరకు రావాలనుకోవడం మూర్ఖత్వం.

* అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది, కానీ దురదృష్టం తలుపు తీసేవరకూ తడుతూనే ఉంటుంది.

* నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం.

* వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు, అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు వాడు గొప్పోడు.

* ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పుని కూడా క్షమించగలగాలి.

* మన దేశంలో లాజిక్ లు కన్నా మ్యాజిక్ లే ఎక్కువ ఇష్టం, అందుకే ఇక్కడ సైంటిస్ట్ లు కన్నా బాబాలు ఫేమస్.

* మనకు వస్తే కష్టం, మనకు కావాల్సిన వాళ్లకు వస్తే నరకం.

* బాధలో ఉన్నవాడిని ఎలా ఉన్నావని అడగడం అమాయకత్వం.. బాగున్నవాడిని ఎలా ఉన్నావని అడగడం మూర్ఖత్వం.

* వినే టైమ్ చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది.

చూసారుగా.. జీవిత సత్యాలని ఇంత కంటే సరళమైన భాషలో బహుశా ఎవరూ చెప్పలేరేమో అన్నట్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో వాటిని పెడుతుంటాడు. ప్రస్తుతం అల వైకుంఠపురములో షూటింగ్ తో బిజీగా ఉన్న త్రివిక్రమ్, ఈ సినిమాలో కూడా తన పెన్ పవర్ తో అదరగొట్టాలని కోరుకుంటూ మాటల మాంత్రికుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts