Homeటాప్ స్టోరీస్ఈ ఏడాది ట్విట్టర్లో హవా వీరిదే!

ఈ ఏడాది ట్విట్టర్లో హవా వీరిదే!

ఈ ఏడాది ట్విట్టర్లో హవా వీరిదే!
ఈ ఏడాది ట్విట్టర్లో హవా వీరిదే!

2020.. ఈ పేరు వింటేనే ప్రతీ ఒక్కరి వెన్నులో వణుకుపుడుతోంది. అంతలా ఈ ఏడాది ప్రతీ ఒక్కరిలోనూ కరోనా కారణంగా భయాన్ని పుట్టించింది. మరో పదహారు రోజుల్లో సర్వమానవాళికి చీకట్టి రోజుల్ని మిగిల్చిన 2020 ముగియబోతోంది. ఈ సందర్భంగా ఈ ఏడాది ట్విట్టర్లో టాప్లో నిలిచిన వారికి సంబంధించిన జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో తెలుగు స్టార్ హీరోలు మహేష్, పవన్కల్యాణ్ టాప్లో నిలిచారు.

ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన `అల వైకుంఠపురములో`.. సరిలేరు నీకెవ్వరు` చిత్రాలు అత్యధికంగా వైరల్ అయిన సినిమాలుగా నిలిచాయి. అయితే తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన `మాస్టర్` మాత్రం ఈ ఏడాది అత్యధికంగా ట్వీట్ చేసిన చిత్రాల్లో ప్రధమ స్థానంలో నిలిచి రికార్డు సాధించింది. ఆ తరువాత స్థానంలో పవన్స్టార్ పవన్కల్యాణ్ నటించిన `వకీల్సాబ్` మూవీ నిలిచింది.

- Advertisement -

అత్యధికంగా ట్విట్టర్లో వైరల్ అయిన టాప్ 10 చిత్రాలుగా మాస్టర్, వకీల్ సాబ్, వాలిమై, సర్కారు వారి పాట, ఆకాశం నీ హద్దురా, ఆర్ ఆర్ ఆర్, పుష్ప, సరిలేరు నీకెవ్వరు, కేజీఎఫ్ చాప్టర్ 2, దర్బార్ చిత్రాలు నిలిచాయి. ఇక అత్యధిక ట్వీట్ల కారణంగా టాప్లో నిలిచిన స్టార్స్ జాబితాలో మహేష్, పవన్ కళ్యాణ్, విజయ్, ఎన్టీఆర్, సూర్య, అల్లు అర్జున్, రామ్చరణ్, ధనుష్, మోహన్లాల్, చిరంజీవి నిలిచారు. కథానాయికల్లో కీర్తిసురేష్, కాజల్ అగర్వాల్, సమంత, రష్మిక మందన్న టాప్లో నిలిచారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All