Tuesday, September 27, 2022
Homeటాప్ స్టోరీస్2019 స్టార్ హీరోయిన్‌ల ప్రేమ‌లు.. పెళ్లిళ్లు

2019 స్టార్ హీరోయిన్‌ల ప్రేమ‌లు.. పెళ్లిళ్లు

2019 love marriages
2019 love marriages

సెల‌బ్రిటీల ప్రేమ‌లు, పెళ్లిళ్లు ఎప్ప‌టికీ ఆస‌క్తిక‌ర‌మే. ఏ హీరోయిన్ ఎవ‌రితో ప్రేమ‌లో వుంది. ఎప్పుడు పెళ్లి జెండా ఊపేస్తోంది అన్న విష‌యాలు చాలా ఆస‌క్తిని రేకెత్తిస్తుంటాయి. ఈ ఏడాది కూడా అలాంటి ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు చాలానే చోటు చేసుకున్నాయి. స్టార్ హీరోయిన్‌లు సీక్రెట్ డేటింగ్‌లు, క‌హ‌స్య వివాహాలు ఈ ఏడాది సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కొంత మంది త‌మ సీక్రెట్ వివాహాల‌పై స్పందించ‌డ‌మూ ఈ ఏడాది ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

- Advertisement -

కోలీవుడ్‌లో హీరోగా విభిన్న చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌చిన ఆర్య క్రేజీ హీరోయిన్ స‌యోషా సైగ‌ల్‌తో గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో మునిగితేలి ఆ త‌రువాత పెద్ద‌ల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ పెళ్లి తెలుగు, త‌మిళ భాష‌ల‌కు చెందిన న‌టీన‌టుల్ని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. న‌టి అర్చ‌న త‌న చిన్న‌న‌టి స్నేహితుడు, ప్ర‌ముఖ వ్యాపార వేత్త జ‌గ‌దీష్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికి టాలీవుడ్‌కు చెందిన ప‌లువురు న‌టీన‌టులు హాజ‌ర‌య్యారు. న‌వంబ‌ర్ 14న ప్రేమికులుగా వున్న వీరు ఇరు కుటుంబాల పెద్ద‌ల సాక్షిగా వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. లీడ‌ర్, మిర్చి, మిర‌ప‌కాయ్‌, భాయ్ చిత్రాల‌తో హీరోయిన్‌గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు బెంగాలీ సుంద‌రి రిచా గంగోపాధ్యాయ‌.

`భాయ్‌` సినిమా త‌రువాత సినిమాల‌కు ఫుల్ స్టాప్ పెట్టి అమెరికా చెక్కేసిన రిచా బిజిసెస్ స్కూల్‌లో చేరింది. అక్క‌డే అమెరికాకు చెందిన శ్వేత‌జాతీయుడు జోతో ప్రేమ‌లో ప‌డింది. ఆ ప్రేమ కాస్త ప‌రిణ‌యానికి దారితీయ‌డంతో ఇరు కుటుంబాల అనుమ‌తితో మూడు నెల‌ల క్రితం వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. త‌న వివాహం సీక్రెట్‌గా జ‌ర‌గ‌లేద‌ని, పెద్ద‌ల అనుమ‌తితోనే జ‌రిగింద‌ని రిచా గంగోపాధ్యాయ రీసెంట్‌గా వివ‌ర‌ణ ఇచ్చింది. ఈ ఏడాది త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీ చిన్ని కూతురు మొద‌టి భ‌ర్త‌కు విడాకులిచ్చి ఈ ఏడాదే మ‌రో పెళ్లి చేసుకుంది. వ్యాపార వేత్తని వివాహం చేసుకోవ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. అల్లు అర్జున్ అన్న‌య్య అల్లు వెంక‌టేష్ త‌న మొద‌టి భార్యు విడాకులిచ్చి ముంబైకి చెందిన ఫ్యాష‌న్ డిజైన‌ర్‌నిపెళ్లాడారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts