Homeటాప్ స్టోరీస్20 ఏళ్ల నా సంగీత ప్ర‌యాణంలో ఎన్నో మధుర స్మృతులు ..స్మిత!!

20 ఏళ్ల నా సంగీత ప్ర‌యాణంలో ఎన్నో మధుర స్మృతులు ..స్మిత!!

Smita
Smita

గాయనిగా తన ప్రయాణాన్ని కొనసాగించిన స్మిత అంచలంచలుగా ఎదిగి పాప్ గాయనిగా పాపులర్ అయ్యారు. ఎన్నో ప్రయివేట్ ఆల్బమ్స్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. నటిగా మల్లీశ్వరి చిత్రంలో తళుక్కున మెరిసి మంచిపేరు సంపాదించుకున్నారు. కాగా తను 20 ఏళ్ళ జర్నీ పూర్తవుతున్న సందర్బంగా స్మిత ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసారు. ఆ కార్యక్రంలో స్మిత మాట్లాడుతూ..

“నాకు ఇంకా నిన్న‌టి మాదిరే అనిపిస్తుంది. అస‌లే మాత్రం అంచ‌నాలు లేకుండా.. ఏం జ‌రుగుతుందో ఇక్క‌డ ఎలా ఉంటుందో తెలియ‌కుండానే వ‌చ్చాను. అక్క‌డ్నుంచే నేర్చుకోవ‌డం మొద‌లు పెట్టాను.. మ్యూజిక్, డాన్స్ లో మ‌రింత శోధ‌న చేసి ఎదిగాను. ఇప్పుడు 20 ఏళ్లైపోయింది. ఇప్పుడు ఒక్క‌సారి వెన‌క్కి తిరిగి చూసుకుంటే నా ఈ ప్ర‌యాణం ఎంతో ఆనందంగా ఉంది. ప్ర‌తీ చిన్న విష‌యాన్ని కూడా నేను ఎంజాయ్ చేసాను. ప్ర‌తీ క్ష‌ణం ఓ కొత్త ఆరంభం మాదిరే అనిపించింది నాకు.

- Advertisement -

1996లో మొద‌ట నేను పాడ‌తా తీయ‌గాలో తొలిసారి మైక్ ప‌ట్టుకున్న క్ష‌ణం నుంచి నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు కూడా అదే ఉత్సాహం.. ఎంజాయ్ మెంట్ నాలో ఉన్నాయి. ఇప్ప‌టికీ ప్ర‌తీ చిన్న విష‌యానికి కూడా ఎగ్జ్టైట్ మెంట్ క‌నిపిస్తుంది నాలో. తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క ఇండిపాప్ నేనే అయినందుకు చాలా గ‌ర్వంగా అనిపిస్తుంది. 10 కంటే ఎక్కువ భాష‌ల్లో పాడ‌టం కూడా నాకు గొప్ప అనుభ‌వం. వీట‌న్నింటితో పాటు 12 ఆల్బ‌మ్స్, 17 మ్యూజిక‌ల్ వీడియోలు, 100కు పైగా ప్లే బ్యాక్స్, 8 దేశాల్లో 200కు పైగా కాన్స‌ర్ట్స్.. ఓ ట్రోఫీ ఇంటికి తీసుకురావ‌డం ఇవ‌న్నీ జీవితంలో ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని తీపి అనుభూతులే.

జులై 22న నా ఈ మ్యూజిక్ అండ్ డాన్స్ జ‌ర్నీకి సంబంధించిన ఓ సెల‌బ్రేష‌న్ ఉంది. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండ‌టానికి కార‌ణం అయిన ప్ర‌తీ ఒక్క‌ర్ని అందులో నేను గుర్తు చేసుకోవాల‌నుకుంటున్నాను. నా ప్ర‌యాణం క్యాసెట్ నుంచి సిడి, సీడి నుంచి పెన్ డ్రైవ్స్, పెన్ డ్రైవ్స్ నుంచి డిజిట‌ల్ వ్యూస్ ఇలా ఎన్నో మారిపోయాయి. నా పాట‌లు వంద‌ల మిలియ‌న్స్ డిజిట‌ల్ వ్యూస్ దాటిపోయి ఎన్నో కోట్ల మంది హృద‌యాల‌ను గెలుచుకున్నాయి. ఈ ప్ర‌యాణంలో అదెంతో మ‌ధురానుభూతి నాకు.

నాకు ఇంత సాధించ‌డానికి ఎంతో చేసిన వాళ్లంద‌ర్నీ గుర్తు చేసుకోడానికి.. వాళ్ల‌కు మ‌న‌సారా కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోడానికి ఏర్పాటు చేసుకున్నాను. క‌ళ‌కు నేను ఇవ్వాల‌నుకుంటున్న గౌర‌వం ఇది. నా ముందున్న ల‌క్ష్యాల‌ను కూడా మీ ముందు ఉంచ‌బోతున్నాను. జులై 22 సాయంత్రం 7 గంట‌ల నుంచి హైద‌రాబాద్ JRC క‌న్వెన్ష‌న్ హాల్ లో ఈ వేడుక‌ను ఎంజాయ్ చేద్దాం..

ప్రేమ‌తో
స్మిత

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All