
బాలీవుడ్ చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, స్క్రీన్ ప్లే రైటర్ శివ కుమార్ సుబ్రమణ్యం కన్నుమూశారు. ఆదివారం రాత్రి ముంబైలో ఈయన తుదిశ్వాస విడిచాడు. స్క్రీన్‌ప్లే రైటర్‌గా కెరీర్ మొదలుపెట్టిన శివకుమార్ నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
జాకీష్రాఫ్, అనీల్‌కపూర్ నటించిన ‘పరింద’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రైటర్‌గానే కాకుండా నటుడిగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. ఈ చిత్రానికి బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌గా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నాడు. దాదాపు 30 సినిమాలలో నటించాడు. చివరగా ఈయన సాన్య మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన ‘మీనాక్షి సుందరేశ్వర్’ సినిమాలో నటించాడు. 2స్టేట్స్, బంగిస్థాన్, ఉంగ్లీ, మీనాక్షి సుందరేశ్వర్ వంటి సినిమాలు ఈయనకు నటుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. శివకుమార్ మృతి పట్ల బాలీవుడ్ సినీప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.