Homeటాప్ స్టోరీస్7 రోజుల్లో 500 కోట్లు వసూల్ చేసిన 2. ఓ

7 రోజుల్లో 500 కోట్లు వసూల్ చేసిన 2. ఓ

2 point 0 7 days world wide collectionsనవంబర్ 29న విడుదలైన 2. ఓ చిత్రం వారం రోజుల్లో 500 కోట్ల భారీ వసూళ్ల ని సాధించింది . మొదటి మూడు రోజుల్లో భారీ వసూళ్లు సాధించిన 2. ఓ చిత్రం తర్వాతి నాలుగు రోజుల్లో వసూళ్లు నెమ్మదించడంతో 500 కోట్ల క్లబ్ లో చేరింది . భారతదేశ వ్యాప్తంగా 375 కోట్ల ని వసూల్ చేయగా ఓవర్ సీస్ లో 125 కోట్ల వసూళ్లు వచ్చాయి దాంతో 7 రోజుల్లో అయిదు వందల కోట్లు వసూల్ చేసింది 2. ఓ చిత్రం . రజనీకాంత్ , అక్షయ్ కుమార్ కున్న క్రేజ్ తో ఈ వసూళ్లు సాధ్యమయ్యాయి .

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2. ఓ చిత్రం 550 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది . తెలుగునాట 70 కోట్ల వసూళ్ల ని సాధించింది ఈ చిత్రం అయితే పెట్టుబడిలో సగం మాత్రమే తిరిగి వచ్చింది . సినిమా విడుదలై వారం అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేకపోవడంతో మరికొన్ని వసూళ్లు రావడం ఖాయం . చైనాలో కూడా భారీ ఎత్తున విడుదల కానుంది కాబట్టి నిర్మాతకు బాగానే డబ్బులు వస్తాయి కానీ భారీ రేట్లకు కొన్న బయ్యర్లకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి . లాభాల సంగతి పక్కన పెడితే నష్టాలు మాత్రం కన్ఫర్మ్ అయ్యాయి .

- Advertisement -

English Title: 2 point 0 7 days world wide collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All