Homeటాప్ స్టోరీస్శుక్రవారాన్ని వదిలిపెట్టారు....శనివారాన్ని పట్టుకున్నారు....

శుక్రవారాన్ని వదిలిపెట్టారు….శనివారాన్ని పట్టుకున్నారు….

Chanakya-Oorantha-Anukuntunnaru
Chanakya-Oorantha-Anukuntunnaru

సినిమా ప్రపంచంలో శుక్రవారానికి చాల పెద్ద సెంటిమెంట్ దాగి ఉంది. శుక్రవారం మాత్రమే సినిమా రిలీజ్ చేయాలనీ ఎవరు రూల్ పెట్టారో కానీ, శుక్రవారం అంటే సినిమా ప్రపంచంలో అందరికి పెద్ద పండగ రోజు. మరి అలాంటి శుక్రవారాన్ని వదిలిపెట్టి రేపు….అనగా శనివారం రోజు 2 సినిమాలు విడుదల అవుతున్నాయి. వాటి సంగతి ఏంటో చూద్దాం రండి.

చిరంజీవి చిరకాల కోరిక అయిన సినిమా ‘సైరా నరసింహా రెడ్డి‘ మొన్న బుదవారం విడుదల అయ్యింది. సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఆ సినిమా ప్రభావం మిగతా సినిమాల మీద పడకూడదు అనుకుంటే, ఆ 2 సినిమాలు విడుదల అవ్వకపోవటమే బెటర్. కానీ పెద్ద సాహసమే చేస్తున్నాయి 2 సినిమాలు. గోపీచంద్ ‘చాణక్య’ మరియు అవసరాల శ్రీనివాస్, నవీన్ నటించిన ‘ఊరంతా అనుకుంటున్నారు’. నిజానికి సినిమాలు విడుదల అవ్వడానికి కారణం….సైరా కి సినిమా టికెట్ దొరక్కపోతే ఈ సినిమాలకి వెళ్ళిపోతారు కాబట్టి.

- Advertisement -

అవును కదా… సైరా సినిమా బుధవారం నుండి చూడడానికి ఎక్కువ మంది జనాలకి కుదరదు. కారణం వాళ్ళకి ఆఫిస్ బాధ్యతలు, ఆదివారం మాత్రమే వాళ్ళకి కాలి సమయం దొరకటం. అందుకే ఆదివారం వాళ్ళకి సైరా టికెట్ దొరక్కపోతే చాణక్య కి కానీ, ఊరంతా అనుకుంటున్నారు సినిమాలకి వెళ్తారు అని ఆయా సినిమాల నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే సైరా వచ్చిన 4 రోజుల తర్వాత సినిమాలు విడుదల చేయాలి అనుకుంటున్నారు. అలా వారికి శనివారం కలిసి వచ్చింది సినిమాలు విడుదల చేస్తున్నారు.

చూద్దాం మరి ఆయా సినిమాల నిర్మాతలు సైరా కి పోటీగా వెళ్లి దెబ్బతింటారో లేక, గట్టెక్కుతారో అనేది రేపు తెలుస్తుంది. చాణక్య సినిమాకి అయిన కొద్దో గొప్పో అంచానాలు ఉన్నాయి. కానీ ఊరంతా అనుకుంటున్నారు సినిమాకి మాత్రం అస్సలు అంచనాలు లేవు, ప్రమోషన్స్ కూడా లేవు. ‘మహేష్ బాబు’ తో మాత్రం ట్వీట్ చేపిస్తున్నారు, ఎందుకంటే మహేష్ బాబు ఫ్యాన్స్ వరకు సినిమాకి మద్దతు లభిస్తుంది అని చిన్న కోరిక.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All