యంగ్ హీరో రామ్ పెద్దనాన్న స్రవంతి రవికిశోర్ కు 2 కోట్ల నష్టం వచ్చిందట ! ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనీ డిసైడ్ అయ్యాడు దాంతో స్క్రిప్ట్ పనులు , లొకేషన్ లు చూడటం ,ఇతరత్రా ఖర్చులతో మొత్తంగా 2 కోట్ల వరకు ఖర్చు అయ్యిందట ! అయితే సినిమా తీయాలనుకున్నాడు స్రవంతి రవికిశోర్ కానీ రామ్ పైన 35 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టాలంటే భయపడ్డాడట ! ఎందుకంటే రామ్ కు ఆ స్థాయిలో మార్కెట్ లేదు పోనీ ధైర్యం చేసి సినిమా చేసినా ఆ మొత్తం తిరిగి వస్తుందన్న నమ్మకం లేకపోవడంతో ఆదిలోనే ఆ సినిమా ని ఆపేసాడు .
దాంతో 2 కోట్ల నష్టం తో సరిపోయిందట లేదంటే సినిమా చేసి ఉంటె ….. హిట్ అయినా పెద్దగా లాభాలు రావు ఒకవేళ ప్లాప్ అయితే పది నుండి 15 కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉందని లెక్కలు కట్టాడట స్రవంతి రవికిశోర్ అందుకే ప్రవీణ్ సత్తారు కి మొహమాటం లేకుండా చెప్పాడట నేను సినిమా తీయడం లేదని . భారీ బడ్జెట్ కాకుండా తక్కువ బడ్జెట్ లో సినిమా చేయాలనీ భావిస్తున్నాడట స్రవంతి రవికిశోర్ . ఇక ప్రవీణ్ సత్తారు ఆ కథ పట్టుకొని నిర్మాత కోసం ఎదురు చూస్తున్నాడు . గరుడవేగ మంచి హిట్ అయ్యింది కానీ బడ్జెట్ ఎక్కువ అయ్యిందని టాక్ స్ప్రెడ్ అయ్యింది దాంతో అతడితో సినిమా అంటే కాస్త భయపడుతున్నారు నిర్మాతలు .