Homeటాప్ స్టోరీస్700 కోట్ల క్లబ్ లో 2. ఓ

700 కోట్ల క్లబ్ లో 2. ఓ

2.0 world wide 15 days collectionsనవంబర్ 29 న విడుదలైన రజనీకాంత్ 2. ఓ చిత్రం 15 రోజుల్లో 700 కోట్ల వసూళ్లు సాధించింది . ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన 2. ఓ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు . దాంతో 15 రోజుల్లో 700 కోట్లు వసూల్ అయ్యాయి . అయితే ఈ సినిమా బడ్జెట్ 550 కోట్లు . ఆసియా ఖండంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భారీ రేట్లకు అమ్మారు లైకా ప్రొడక్షన్స్ . రజనీకాంత్ కున్న క్రేజ్ తో ఎక్కువ రేట్లకు కొన్నారు బయ్యర్లు కూడా .

రెండు తెలుగు రాష్ట్రాలలో 55 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది ఇంతవరకు . ఇంకా బయ్యర్లు లాభాలలోకి రావాలంటే మరో 20 కోట్ల షేర్ రావాల్సిందే . అయితే తెలంగాణలో విడుదల చేసిన దిల్ రాజు మాత్రం సేఫ్ అయ్యాడు . అతడి పెట్టుబడి తిరిగి వచ్చేసింది . ఇక రావాల్సింది ఎన్వీ ప్రసాద్ , యువి క్రియేషన్స్ వాళ్లకు మాత్రమే ! బాహుబలి రికార్డులు ఈ చిత్రం బద్దలు కొడుతుందని అనుకున్నారు కానీ ఆ స్థాయిలో మాత్రం వసూళ్లు రాలేదు , అయితే కొన్ని చోట్ల మాత్రం బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది 2. ఓ . రజనీకాంత్ , అక్షయ్ కుమార్ అమీ జాక్సన్ లు నటించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే .

- Advertisement -

English Title:  2.0 world wide 15 days collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All