Homeటాప్ స్టోరీస్2.0 అక్కడ డిజాస్టర్ అయిందిగా

2.0 అక్కడ డిజాస్టర్ అయిందిగా

ROBO 2.0
2.0 అక్కడ డిజాస్టర్ అయిందిగా

భారీ చిత్రాలకు కేరాఫ్ దర్శకుడు శంకర్ 2.0 తో చేసిన ప్రయత్నం కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. అనుకున్న బడ్జెట్ లో చేసిన రోబో సంచలన విజయం సాధించగా, దానికి కొనసాగింపుగా వచ్చిన 2.0 పై లెక్కలేకుండా ఖర్చు పెట్టుకుంటూ వెళ్లిపోయారు. భారీతనం మీద పెట్టిన శ్రద్ధలో సగం స్క్రిప్ట్ మీద పెట్టకపోవడంతో 2.0 ఒక కాస్ట్లీ తప్పుగా మిగిలిపోయింది. తమిళ్, తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం బయ్యర్లకు నష్టాలనే మిగిల్చింది.

ఇది జరిగిన 10 నెలల తర్వాత 2.0 చైనాలో విడుదలైంది. అక్కడ దాదాపు 10 వేల థియేటర్లలో 50 వేలకుపైగా స్క్రీన్లలో 2.0ను విడుదల చేసారు. భారీ రేటుకు ఈ చిత్రాన్ని అక్కడ కొనుక్కోగా 20 మిలియన్ డాలర్లు వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కు రాని పరిస్థితి. అయితే ఈ చిత్రం మొదటి రోజు కేవలం 1.3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. రెండో రోజుకి కలెక్షన్లు సగానికి సగం తగ్గిపోయాయి. చూస్తుంటే 2.0 చైనాలో బ్రేక్ ఈవెన్ కాదు కదా భారీ స్థాయి డిజాస్టర్ గా మిగిలే అవకాశాలున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All