2. ఓ రివ్యూ

2.0 movie review
2. ఓ రివ్యూ

2. ఓ రివ్యూ :
నటీనటులు : రజనీకాంత్ , అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్
సంగీతం : ఏ ఆర్ రెహమాన్
నిర్మాత : సుభాస్కరన్
దర్శకత్వం : శంకర్
రేటింగ్ : 3.5/ 5
రిలీజ్ డేట్ : 29 నవంబర్ 2018

సూపర్ స్టార్ రజనీకాంత్ , అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ , శంకర్ ల కాంబినేషన్ లో రూపొందిన భారీ ప్రతిష్టాత్మక చిత్రం 2. ఓ . ఆసియా ఖండంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

కథ :

సెల్ ఫోన్ లు హఠాత్తుగా మాయం అవుతూ ఉండటంతో ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది . ఆ సమావేశంలో పాల్గొన్న డాక్టర్ వశీకరణ్ (రజనీకాంత్ ) ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవాలంటే చిట్టీ కి మాత్రమే సాధ్యమని అంటాడు , అయితే అందుకు మంత్రి ఒప్పుకోడు . కానీ సెల్ ఫోన్ లు మాయం అవడమే కాకుండా సంబంధిత మంత్రి ని , సెల్ ఫోన్ వ్యాపారి ని చంపేయడంతో ఇది ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడానికి వశీకరణ్ చిట్టి కి తిరిగి ప్రాణం పోస్తాడు . దాంతో ఈ దురాగతానికి పాల్పడుతోంది పక్షిరాజా అని తెలుస్తుంది . అసలు పక్షి రాజా ఎవరు ? సెల్ ఫోన్ లను ఎందుకు లాగేసుకుంటున్నాడు . మంత్రిని , సెల్ ఫోన్ వ్యాపారిని ఎందుకు చంపాడు ? ఎందుకు విలయం సృష్టించాడు ? దాన్ని చిట్టి నిలువరించాడా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

రజనీకాంత్
అక్షయ్ కుమార్
విజువల్స్
రీ రికార్డింగ్

డ్రా బ్యాక్స్ :

కామన్ మ్యాన్ కు అర్ధం కానీ టెక్నిక్

నటీనటులు :

డాక్టర్ వశీకరణ్ గా , చిట్టి గా రజనీకాంత్ నటన హైలెట్ గా నిలిచింది . అలాగే చిట్టి లో రజనీ స్టైల్ ని చూపించి మరింతగా ఆకట్టుకున్నాడు . రజనీ స్టైల్ కు ఈలలతో థియేటర్ లు మారుమోగడం ఖాయం . అలాగే ఈ వయసులో కూడా చిట్టి పాత్ర కోసం పడిన తపన అద్భుతమనే చెప్పాలి . ఇక అక్షయ్ కుమార్ నటన కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . బ్రహ్మాండమైన విలనిజం పండించాడు , తన మేకప్ తో ఎంత కష్టపడ్డాడో చాటి చెప్పాడు . అమీ జాక్సన్ అందంగా కనిపించింది , అలాగే అందంగా నటించింది కూడా . ఇతర పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధిమేరకు నటించారు .

సాంకేతిక వర్గం :

శంకర్ అద్భుత సృష్టి ఈ 2. ఓ అని సగర్వంగా చెప్పొచ్చు . సామాజిక అంశాలను స్పృశిస్తూ దానికి మంచి సందేశాన్ని అందించడం శంకర్ గత చిత్రాల అలవాటు . అలాగే ఈ చిత్రంలో కూడా మరో సామాజిక అంశాన్ని స్పృశించి ప్రజలకు , ప్రభుత్వానికి మేలుకొలుపు అయ్యాడు . సెల్ ఫోన్ ల వల్ల మనుషులు ఎలాంటి దుష్పరిణామాలకు లోనౌతున్నారో , ఎలా బానిసలు అవుతున్నారో దాని వల్ల జరుగబోయే పరిణామాలు ఏంటో స్పష్టంగా చెప్పాడు . సెల్ ఫోన్ అంశానికి భారీ విజువల్స్ ని జోడించి మరోసారి టెక్నాలజీ లో తన సత్తా ఏంటో రుజువు చేసాడు శంకర్ . నీరవ్ షా విజువల్స్ అద్భుతమనే చెప్పాలి . 3 డి టెక్నాలజీ లో నిర్మించిన ఈ చిత్రం సరికొత్త అనుభూతి ని ఇవ్వడం ఖాయం . రెహమాన్ , రసూల్ ప్రతిభతో ఈ సినిమా మరో మెట్టు ఎక్కింది . రీ రికార్డింగ్ ఈ చిత్రానికి ఆయువు పట్టుగా నిలిచింది . లైకా సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఆసియా ఖండంలోనే తన గొప్పతనాన్ని చాటింది .

ఓవరాల్ గా :

శంకర్ దర్శకత్వ ప్రతిభ , రజనీకాంత్ , అక్షయ్ కుమార్ ల నటన , లైకా ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన ఈ 2. ఓ చిత్రం చక్కని సందేశాన్ని ఇవ్వడమే కాకుండా అద్భురమైన విజువల్స్ తో థ్రిల్ చేయడం ఖాయం .

English Title: 2.0 movie review

Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All