Homeఎక్స్ క్లూసివ్“జీవితంలో యుద్ధం - యుద్ధంలో జీవితం” 1917

“జీవితంలో యుద్ధం – యుద్ధంలో జీవితం” 1917

“జీవితంలో యుద్ధం - యుద్ధంలో జీవితం” 1917
“జీవితంలో యుద్ధం – యుద్ధంలో జీవితం” 1917

ఆనాడు ద్వాపరయుగంలో జనాల అతి ఆకలి, అత్యాశ, ఆధిపత్య పోరు, అహంకారం ఇవన్నీ చూసి ఆ పెద్దాయన ఒకే ఒక మాట అంటాడు. “యుద్ధాయ కృత నిశ్చయ: ”. అంటే యుద్ధం జరిగితీరుతుంది అని అర్ధం. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఆలోచించకుండా అప్పటి నుండి మానవాళి మార్పు కావాలి.. మార్పు చెయ్యాలి.. అనుకున్నప్పుడల్లా యుద్ధం వైపు చూస్తున్నారు. అప్పట్లో కోట్ల మంది కొట్టుకుంటూ ఉంటే, ఇప్పుడు అదే కోట్ల మంది మనుషులపై ఒక గుప్పెడు క్రిములు విసిరేసి ఏమీ తెలియనట్లు ఉంటున్నారు. ఈ ఏడు ఆకాడమీ అవార్డ్స్ ఆస్కార్ బరిలో నిలిచి, గెలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న 1917 సినిమా విశేషాల్లోకి వెళ్తే,

1917 సినిమా వార్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల్లో ఒక ఆణిముత్యం. శత్రువుల శిబిరంలోంచి ప్రయాణించి తమ సెకండ్ బెటాలియన్ ట్రూప్స్ కు ఒక మెసేజ్ డెలివరీ చేయమని ఇద్దరు సైనికులకు ట్రూప్ కమాండింగ్ ఆఫీసర్ టాస్క్ అప్పగిస్తాడు. 1600 మంది బ్రిటిష్ సైనికులు దాడికి సిద్దంగా ఉంటారు. మరుసటి రోజు ఉదయం బ్రిటిష్ సైన్యం జర్మనీ సైనిక స్థావరాలపై చేసే దాడిని ఆపాలనుకున్నవిషయాన్నిలెటర్ ద్వారా సెకండ్ బెటాలియన్ లెఫ్టినెంట్ కి అందచేయాలి.

- Advertisement -

ఎందుకంటే బ్రిటిష్ సైనికుల దాడికోసం జర్మనీ సిద్ధం చేసిన trap అది.తెలియకుండా ఎటాక్ చేస్తే బ్రిటిష్ సైనికుల ప్రాణాలు పోతాయి.మొత్తానికి ఇది ఒక సూసైడ్ మిషన్. ఈ మిషన్ కోసం బయల్దేరిన వాళ్ళు ఇద్దరు. ఒకడు కార్పోరెల్ బ్లేక్, రెండో వ్యక్తి  స్కోఫీల్డ్. వారికున్నసమయం ఎనిమిది గంటలు.మధ్యలో శత్రువుల శిబిరంతో పాటు, ఒక నది కూడా దాటాలి.  సర్తువులు శిబిరం ఖాళీ చేసినా, ఎవరైనా వస్తే బ్రతక కూడదని ట్రాప్స్ సెట్ చేస్తారు.అవి పేలి, స్కోఫీల్ద్ గాయపడతాడు.

ఈ సినిమా ప్రత్యేకత అంటే అద్భుతమైన డీటేయిలింగ్. ఇద్దరు ప్రయాణం మొదలంపెట్టినా Schofield ఒక్కడే బ్రతికి గమ్యం చేరతాడు. బ్లేక్ చనిపోతాడు. తన మిత్రుడు బ్లేక్ సోదరుడిని కలిసి, విషయం తెలియజేస్తాడు స్కోఫీల్ద్. తమ్ముడు పోయాడన్నదుఃఖాన్ని దాచుకుని “నీకు డ్రెస్సింగ్ చేస్తా పద” అని అనటంతో సినిమా ముగుస్తుంది.

యుద్ధం కలిగించే ఉన్మాదం కన్నా మిగిల్చే విషాదమే ఎక్కువని, మనుషులలో కనపడకుండా దాగి ఉన్న ఒక మహమ్మారి లాంటి వ్యాధి పేరే “యుద్ధం” అని అర్ధం అవుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All