Homeఎక్స్ క్లూసివ్అమరావతిలో ఎన్టీఆర్ 109 అడుగుల భారీ విగ్రహం

అమరావతిలో ఎన్టీఆర్ 109 అడుగుల భారీ విగ్రహం

109 foot NTR statue in Amaravathi
NTR Statue

ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతిలో  ఎన్టీఆర్ 109 అడుగుల భారీ విగ్రహాన్ని  ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలుగుజాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్. నిమ్మకూరు లో సామాన్య కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ సినిమారంగంలోకి అడుగుపెట్టి సంచలన విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ప్రపంచ రికార్డ్ సృష్టించాడు ఎన్టీఆర్.

అలాగే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కూడా ఎన్టీఆర్ దే అందుకే అంతటి మహనీయుడి విగ్రహాన్ని ప్రపంచంలోనే అత్యధిక పెద్దదిగా ఉండాలని భావించిన చంద్రబాబు 109 అడుగుల భారీ విగ్రహంని ఏర్పాటు చేయాలని సంకల్పం తీసుకున్నాడు. అయితే ఈ విగ్రహం ఏర్పాటు కు మాత్రం కొంత సమయం పట్టే అవకాశం ఉంది కానీ భారీ విగ్రహంతో  ఎన్టీఆర్ స్ఫూర్తిని తెలుగువారికి అందించడానికి సిద్ధమయ్యారు చంద్రబాబు.

- Advertisement -

English Title: 109 foot NTR statue in Amaravathi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All