
ఒక భాషలో విడుదలైన సినిమా నచ్చితే వేరే బాష వాళ్ళు కొనుక్కుని రీమేక్ చేయడం ఒక పద్దతి. ఒక భాషలో సినిమాను వేరే భాషలో డబ్బింగ్ చేయడం మరో పద్దతి. అయితే ఒక భాషలో విడుదలైన సినిమాను కొనుక్కుని రీమేక్ చేసి దాన్ని మళ్ళీ కొనుక్కున్న భాషలోనే డబ్బింగ్ చేసి విడుదల చేయడం అరవోళ్లకి చెల్లింది.
ఇప్పటికే తెలుగులో ఈ టైపు డబ్బింగ్ సినిమాలు మనం చాలానే చూసాం. రీసెంట్ గా విశాల్ నటించిన అయోగ్య (టెంపర్) కూడా ఇలానే తెలుగులో వదిలారు. ఇక ఇప్పుడు 100 పెర్సంట్ కాదల్ వంతు వచ్చింది. పేరు వింటేనే అర్ధమైపోయిందిగా విషయం. 100 పెర్సంట్ లవ్ సినిమాను తమిళ్ లో రీమేక్ చేసి ఈ వారం తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఒకసారి చూసేసిన సినిమాను డబ్బింగ్ వెర్షన్ లో ఎవరైనా ఎందుకు చూడాలనుకుంటారో వాళ్ళకే తెలియాలి. ఈ సినిమాల ఫలితాలన్నీ దాదాపుగా ఒకటే. అయినా కూడా ఎందుకో మరి వాళ్ళు ఈ పద్దతి మాత్రం మార్చుకోవట్లేదు. ఈ అతి మెయిన్ గా తమిళ్ నుండే వస్తుండడం కొసమెరుపు.