Homeటాప్ స్టోరీస్100 కోట్లు మరియు అందని ద్రాక్ష రెండు ఒక్కటే...

100 కోట్లు మరియు అందని ద్రాక్ష రెండు ఒక్కటే…

100 కోట్లు మరియు అందని ద్రాక్ష రెండు ఒక్కటే...
100 కోట్లు మరియు అందని ద్రాక్ష రెండు ఒక్కటే…

చిన్నప్పుడు మనకి 10 రూపాయలు అంటే 1000 లాగ అనిపించేవి. కానీ ఇప్పుడు ఆ 1000 రూపాయలని 10 రూపాయలు పెట్టినంత ఈజీ గా ఖర్చు పెట్టేస్తున్నాము. సినిమాల విషయంలో కూడా సీనియర్ కథా నాయకులకి 100 కోట్ల బెంచ్ మార్క్ అందని ద్రాక్షా లాగ ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ కథా నాయకులకి 50 కోట్లు కూడా దాటని సినిమాలు ఉన్నాయి. చిరంజీవి గారికి మాత్రమే ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా ద్వారా 100 కోట్లు సాధించే ఘనత పేరు ప్రతిష్టలు దక్కాయి.

మరి మిగిలిన ముగ్గురు కథానాయకుల విషాయానికి వస్తే ‘విక్టరీ వెంకటేష్’ గారికి ఈ సంవత్సరం ‘ఎఫ్ 2’ సినిమా ద్వారా 100 కోట్ల దాకా వెళ్లారు కానీ మైలు రాయిని చేరుకోలేకపోయారు. చిరంజీవి తర్వాత వెంకటేష్ గారు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. వెంకటేష్ గారి మీద జనాలకి ఆ నమ్మకం అయితే ఉంది. బాలకృష్ణ గారి విషయానికి వస్తే ‘జై సింహా’ తర్వాత చేసిన ‘ఎన్.టి.ఆర్’ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు భారీగా విఫలం అయ్యి బాలకృష్ణ గారి తదుపరి సినిమాలకి నిర్మాతలు అంత డబ్బులు పెట్టాలా? అని భయపడుతున్నారు. ఒకవేళ బాలకృష్ణ గారికి హిట్ పడితే ఆ సినిమా 50 కోట్ల వరకు రాగలుగుతుంది కానీ 100 కోట్ల బెంచ్ మార్క్ మాత్రం కష్టమే అంటున్నారు.

- Advertisement -

ఇక అక్కినేని నాగార్జున గారి విషయానికి వస్తే ‘ఊపిరి’ సినిమా తర్వాత చేసిన 6 సినిమాలు (ఓం నమో వెంకటేశాయ, రాజు గారి గది 2, దేవదాస్, ఆఫీసర్, నిర్మల కాన్వెంట్, మన్మధుడు 2) వరుసగా ఫ్లాపులుగా ఉన్నాయి. చేతిలో బిగ్ బాస్ షో నడుస్తుంది. సినిమా చేస్తే సొంత నిర్మాణం అయిన ‘అన్నపూర్ణ స్టూడియోస్’ మీద మాత్రమే సినిమాలు చేస్తే ఆ సినిమా విజయం, అపజయం వారికే దక్కుతుంది. ఒకవేళ నాగార్జున గారికి సోలోగా సాలిడ్ హిట్ పడితే ఆ స్టామినా 40 నుంచి 50 కోట్ల వారికి వెళ్లి ఆగిపోతుంది తప్ప పెరగలేదు అని చెప్తున్నారు సినిమా వర్గాల వాళ్ళు.

ఇక మెగాస్టార్ చిరంజీవి గారు వీరికంటే ముందు వరుసలో ఉండటం వలన చిరంజీవి గారి తదుపరి సినిమాలు మంచిగా హిట్ అయినా, లేక ఫ్లాప్ అయినా 100 కోట్ల బెంచ్ మార్క్ ని నేటి తరం యువ కథానాయకులు అయిన మహేష్ బాబు, జూ.ఎన్.టి.ఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో సమానంగా ఉన్నారు. ఇక వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున ముగ్గురు 100 కోట్ల భారీ సినిమా కథని ఎంచుకొని వారి వారి మార్కెట్ పరంగా బడ్జెట్ పెట్టుకుంటే అందులో ఒక 90 శాతం వరకు ప్రయత్నం తప్పకుండ సక్సెస్ అవుతుంది అంటున్నారు వారి అభిమానులు.

ఒక సారి విజయం రావచ్చు, ఇంకొక సారి విఫలం అవ్వచ్చు సినిమాలు విజయం దక్కితే తదుపరి సినిమాకి కూడా 100 కోట్లు రావొచ్చు, అదే మరలా ఒకసారి ఫ్లాప్ పడిందంటే ఆ పొరపాటుని వెంటనే క్లియర్ చేస్తేనే బాగుంటుంది లేదంటే రేసులో వెనక బడి ఉండాలి. ఏ హీరో అభిమానికి అయినా వారి అభిమాన హీరో 100 కోట్లు కొల్లగొడుతున్నారు అంటే సంతోషమే కదా…అలా ప్రతి హీరో అభిమాని అనుకుంటూ ఉంటారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All