Homeటాప్ స్టోరీస్`ఉప్పెన‌` భామ‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌!

`ఉప్పెన‌` భామ‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌!

`ఉప్పెన‌` భామ‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌!
`ఉప్పెన‌` భామ‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌!

బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కించిన చిత్రం `ఉప్పెన‌`. వైష్ఱ‌వ్‌తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్‌లుగా ప‌రిచ‌య‌మైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంతో క‌న్న‌డ భామ కృతిశెట్టి కి వ‌రుస ఆఫ‌ర్లు ప‌ల‌క‌రిస్తున్నాయి. `ఉప్పెన‌` రిలీజ్‌కి ముందే నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న `శ్యామ్ సింఘ‌రాయ్‌`లో అవ‌కాశం ద‌క్కించుకున్న కృతి శెట్టి తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌ని సొంంత చేసుకున్న‌ట్టు తెలిసింది.

ఎన్‌. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే. గురువారం ఈ ప్రాజెక్ట్‌ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు మేక‌ర్స్ శ్రీ‌నివాస్ చిట్టూరి. రామ్  19వ చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈ మూవీలో హీరోయిన్‌గా కృతిశెట్టి ని ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది. గ‌త కొన్నేళ్లుగా తెలుగులో స్ట్రేయిట్ మూవీ చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న లింగుస్వామి ఎట్ట‌కేల‌కు తెలుగులో రామ్‌తో సినిమా చేయ‌బోతున్నారు.

- Advertisement -

ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ చేయ‌బోతున్నారు. క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ మూవీకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని చిత్ర బృందం త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నుంద‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All