Homeటాప్ స్టోరీస్నాగబాబు సలహాలను నిర్మాతలు పాటిస్తారా..?

నాగబాబు సలహాలను నిర్మాతలు పాటిస్తారా..?

మెగా బ్రదర్ మరోసారి ఏపీ సర్కార్ ఫై విరుచుకపడుతూనే..టాలీవుడ్ నిర్మాతలకు పలు సలహాలు సూచనలు తెలియజేసారు. గత కొద్దీ నెలలుగా ఏపీ సర్కార్ చిత్రసీమను తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా చిరంజీవి పలువురు హీరోలను, దర్శకులను వెంటపెట్టుకొని టికెట్స్ ధరలు పెంచేలా చూడాలని , అదనపు షోస్ కు అనుమతి ఇవ్వాలని కోరారు. దానికి సర్కార్ సరే అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత మాత్రం ఎప్పటిలాగేనే భీమ్లా నాయక్ రిలీజ్ టైం లో తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసింది. ఇంత జరుగుతున్న కానీ చిత్రసీమ నుండి ఎవరు మాట్లాడకపోవడం దారుణమని అంత మాట్లాడుకుంటున్నారు. ఇక నాగబాబు కూడా తనదైన శైలిలో స్పందిస్తూ..టాలీవుడ్ నిర్మాతలకు పలు సలహాలు ఇచ్చారు.

- Advertisement -

“టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా జగన్ కి అండగా నిలవాలి అని కోరుకుంటున్నా. అవసరమైతే జగన్ సీఎంగా ఉన్నంత కాలం టాలీవుడ్ లో ఏ సినిమా విడుదల చేయకూడదు. సినిమా ఇండస్ర్టీని ఎలాగైనా అణిచివేయాలని చూస్తున్నారు. కాబట్టి మీ సినిమాల ప్రదర్శన కోసం ఓటీటీకి వెళ్లిపోండి. అమెజాన్ ప్రైమ్..నెట్ ప్లిక్స్ ని ఉపయోగించండి. ఏపీలో మాత్రం చిత్రాల్ని ప్రదర్శించడానికి జియో టెలికాస్ట్ టెక్నాలజీ ఉపయోగించండి. తెలంగాణ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయండి. ఇక్కడి రాష్ర్ట ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని“ అన్నారు. అక్కడితో ఆగకుండా “ఓటీటీ రిలీజ్ సినిమాలు చేయడం చాలా సులభం అవుతుంది. హీరోలని 150 వర్కింగ్ డేస్ అడిగే బధులు 60 రోజులు అడగండి. తద్వారా సినిమా త్వరగా పూర్తవుతుంది. నిర్మాణ వ్యయాలు తగ్గుతాయి. స్టార్ హీరోలు ఒక సినిమాకి బధులుగా 3 ఓటీటీ సినిమాలు చేయోచ్చు. ఆ రూపంలోనూ హీరోలు బాగానే సంపాదించ వచ్చు “అని అన్నారు. మరి నాగబాబు సలహాలు ఎంతమంది పాటిస్తారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All