Homeఎక్స్ క్లూసివ్ఆ డైరెక్టర్ కు అంత రెమ్యునరేషనా ?

ఆ డైరెక్టర్ కు అంత రెమ్యునరేషనా ?

అనిల్ రావిపూడి తాజాగా మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా …… 12 కోట్లట ! అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అతడికి సక్సెస్ ఉంది కాబట్టి ఆ భారీ మొత్తాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారట నిర్మాతలు దిల్ రాజు , అనిల్ సుంకర .

- Advertisement -

పటాస్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టేసాడు . దాని తర్వాత సుప్రీమ్ , రాజా ది గ్రేట్ చిత్రాలు చేయగా అవి కూడా సూపర్ హిట్స్ అయ్యాయి . ఇక ఈ ఏడాది జనవరిలో రిలీజ్ అయిన ఎఫ్ 2 వసూళ్ల సునామి సృష్టించింది . 85 కోట్ల షేర్ ని 180 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది . అంతేకాదు రీమేక్ , డబ్బింగ్ , శాటిలైట్ , డిజిటల్ రైట్స్ రూపంలో మరో 50 కోట్లని దిల్ రాజు చేతిలో పెట్టింది దాంతో ఈ భారీ మొత్తాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారు దిల్ రాజు , అనిల్ సుంకర లు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All